• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సరదా కోసం ఆకతాయి చేసిన కొంటె పని..! ఇమ్రాన్ ఖాన్ కు బీజేపీ సభ్యత్వం ఇచ్చిన తుంటరి..!!

|

గుజరాత్/హైదరాబాద్: కొందరు తుంటరిగా చేసే పనులు పెద్ద వివాదాలను రాజేస్తాయి. ఆ ఏముందిలే సరదాగా చేద్దామనుకుంటే అది కాస్తా దేశ వ్యాప్తంగా సంచలనం అవుతుంది. ఆ పనిని ఎవరు, ఎప్పుడు, ఎందుకు చేసారని పోలీసులు పెద్ద ఎత్తున విచారణ చేపడుతుంటారు. అందుకోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి మరీ రంగంలోకి దించుతారు. నిందుతుడి కోసం బహుమానాలను కూడా ప్రకటిస్తుంటారు పోలీసులు. ఇవన్నీ తెలుసుకున్నాక గానీ సదరు ప్రభుద్దుడికి తెలయదు తాను చేసిన పని ఎంతటి హైరానాకి దారితీసిందోనని. పోలీసులు హాడావిడి, పత్రికల్లో వార్తలు, టీవిల్లో ప్రకటనలు, వాల్ పోస్లర్లలో ఫోటోలు చూసి ఖంగుతిన్న తర్వాత, నింపాదిగా ఓస్ అదాి నేనే సరదాకోసం చేసాను సార్ అంటూ లేచొస్తాడు సదరు పోకిరీ. ఇలంటి వ్యవహారాలు దేశంలో ఎక్కడో చోట, ఏదో మూలన నిత్యం జరుగుతూనే ఉంటాయి. అచ్చం ఇలాంటి సంఘటనే గుజరాత్ లో చోటుచేసుకుంది. అదేంటో మీరే చదవండి..!

Naughty work done for fun.! Imran Khan gets BJP membership..!!

ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీ అయిన బీజేపీ భారీ సంఖ్యలో కార్యకర్తలను చేర్చుకునేందుకు ఈ-సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. పేరు, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ, ఇతర సమాచారాన్ని అందించి.. సభ్యత్వం పొందే అవకాశాన్ని కల్పించింది. దీని ద్వారా లక్షలాది మంది కాషాయ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. అయితే, గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తి ఓ కొంటె పని చేశాడు. గులాం ఫరీద్ షేక్(40) అనే వ్యక్తి ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌కే బీజేపీ సభ్యత్వం తీసుకున్నాడు. పార్టీ వెబ్‌సైట్‌లో ఇమ్రాన్ ఖాన్ వివరాలు ఎంటర్, ఫోటోను అప్‌లోడ్ చేసి మెంబర్ షిప్ తీసుకున్నాడు.

Naughty work done for fun.! Imran Khan gets BJP membership..!!

ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుండటం వల్ల వివరాలను సర్టిఫై చేసే అవకాశం రాలేదు. అంతేకాదు.. రేప్ కేసుల్లో దోషులైన ఆశారాం బాపు, గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌లకు కూడా సభ్యత్వం తీసుకున్నాడు. సభ్యత్వానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. వాటిని చూసిన బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ ఇమేజ్‌ను దెబ్బతీయాలని ఇలాంటి పనులకు పాల్పడ్డాడని ఫరీద్‌పై కేసు పెట్టారు. ఫోర్జరీ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A guy from Gujarat did a naughty job. Ghulam Farid Sheikh, 40, has been a member of the BJP for Prime Minister of Pakistan Imran Khanke. Imran Khan entered the party website, uploaded the photo and took the member ship. The whole process was going on online so the details could not be certified.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more