కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పుల కలకలం
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం శాన్ డియోగోలోని నావల్ ఆసుపత్రిలో ఓ దుండగుడు కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఇదే విషయాన్ని స్థానికులు ఫేస్ బుక్ లో పోస్టు చెయ్యడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆసుపత్రిలో ఓ షూటర్ తిరుగుతున్నాడని అధికారులు దృవీకరించారు. షూటర్ రెచ్చిపోయి కాల్పులు జరపడంతో స్థానికులు హడలిపోయారు.

ముందు జాగ్రత్తగా నావెల్ ఆసుపత్రిని మూసివేశామని అధికారులు తెలిపారు. ఆసుపత్రి సిబ్బందిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులు జరిపి అనేక మందిని గాయపరిచాడని అధికారులు చెప్పారు. అయితే ఈ కాల్పుల్లో ఎవరైనా మరణించారా అనే విషయం తెలియడం లేదని అధికారులు అన్నారు.
ఆసుపత్రి భవనం చుట్టుపక్కల బలగాలు ఉన్నాయని, ఆ షూటర్ ను పట్టుకుంటామని అధికారులు అంటున్నారు. ఆసుపత్రి సిబ్బంది కళ్లు కప్పి దుండగుడు లోపలికి వెళ్లి ఉంటాడని, అతను ఉగ్రవాదా, కాదా అనే విషయం కచ్చితంగా తెలియడం లేదని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications