ఈసీఎల్ జాబితాలో చేర్చారు: నవాజ్ షరీఫ్, మర్యమ్‌కు షాకిచ్చిన పాక్ ప్రభుత్వం
లాహోర్: పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు మరో ఎదురుదెబ్బ. తాజాగా షరీఫ్‌తో పాటు అతని కుమార్తె మరియం పేర్లను ఆ దేశ ప్రభుత్వం నిషేధిత జాబితా(ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్-ఈసీఎల్)లో చేర్చింది. శుక్రవారం స్వదేశానికి వచ్చిన తర్వాత తిరిగి మళ్లీ విదేశాలకు వెళ్లకుండా వారిని అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
అవెన్‌ఫీల్డ్ ప్రాపర్టీస్ అవినీతి కేసులో ఇస్లామాబాద్‌లోని నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్‌ఏబీ) కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించిన అనంతరం తాజాగా ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. అవినీతి కేసులో భాగంగా షరీఫ్‌కు 10ఏళ్లు, మరియంకు 7ఏళ్లు, అల్లుడు రిటైర్డ్ కెప్టెన్ సఫ్దార్‌కు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తండ్రీ, కూతరు ఇద్దరూ లండన్‌లోనే ఉన్నారు. షరీఫ్ భార్య బేగం కుల్సూమ్ నవాజ్ తీవ్రమైన గొంతు క్యాన్సర్‌తో బాధపడుతోంది. గుండెపోటు రావడంతో జూన్ 14 నుంచి ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. లాహోర్ ఎయిర్‌పోర్టులో దిగగానే షరీఫ్, మరియంలను అరెస్ట్ చేస్తామని ఎన్‌ఏబీ ఇప్పటికే ప్రకటించింది.












Click it and Unblock the Notifications