రష్యా వార్నింగ్ పట్టించుకోని అమెరికా: ప్రతీకార దాడులు జరిగితే పెనముప్పే!..
ఇప్పటికే సిరియా విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను రష్యా హెచ్చరించినా.. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శుక్రవారం ఉదయం అమెరికా సిరియా సైన్యంపై క్షిపణి దాడికి పాల్పడింది.
న్యూయార్క్: సిరియాలో కొనసాగుతోన్న అంతర్యుద్దంలో అమెరికా జోక్యం చేసుకోవడంతో రష్యా తీవ్ర స్థాయిలో స్పందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే సిరియా విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాను రష్యా హెచ్చరించినా.. ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ శుక్రవారం ఉదయం అమెరికా సిరియా సైన్యంపై క్షిపణి దాడికి పాల్పడింది.
షైరత్ వైమానిక స్థావరంపై సుమారు 60క్షిపణులను అమెరికా ప్రయోగించింది. సిరియాలో రసాయనిక దాడి అధ్యక్షుడు అసద్ చేయించిన చర్యేనని భావిస్తున్న అమెరికా ఈ దాడికి పాల్పడింది. మరోవైపు సిరియాలో అమెరికా దాడులు జరిపితే ప్రతీకార చర్యలు తప్పవని రష్యా హెచ్చరించిన నేపథ్యంలో.. ఇరు దేశాల మధ్య పరిస్థితులు ఎక్కడి కి దారి తీస్తాయోనన్న ఆందోళ నెలకొంది.

కాగా, అమెరికా దాడి ఘటనకు ఒకరోజుకు ముందు రష్యా రాయబారి ఆ దేశాన్ని హెచ్చరించారు. సిరియాలో సైనిక దాడికి పాల్పడవద్దని సూచించారు. అమెరికా మాత్రం ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఇక సిరియాలో దాడుల విషయానికొస్తే.. రసాయనిక దాడితో వందాలది మంది చిన్నారులు మృత్యువాత పడగా మరో 400మంది చిన్నారులు శ్వాసకోస వ్యాధులతో బాధపడుతున్నారు.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సిరియా మెడికల్ రిలీఫ్ గ్రూప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. దీనిపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications