5,285 మంది మృతి? సెర్చ్ ఆపరేషన్ క్లోజ్.. వరద బాధితులకు వెంటనే ఇన్సూరెన్స్, క్యాష్!
ఆగస్టు 26న వచ్చిన భయంకరమైన వరదలు నేపాల్‌ను ఎంతలా ముంచెత్తాయో అందరికీ తెలిసిందే. భోటేకోశి, త్రిశూలి నదులు ఉప్పొంగి గ్రామాలు, వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది జాడ లేకుండా పోయారు. అయితే ఇలా గల్లంతైన వారిని అధికారికంగా చనిపోయినట్లు గుర్తించడంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. దీంతో బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సాయం ఆలస్యమవుతోంది. ఈ సమస్యను త్వరగా తీర్చడానికి, గల్లంతైన 5,285 మంది బాధితుల కుటుంబాలకు వెంటనే పరిహారం, ఇతర హక్కులు దక్కేలా రెండు ముఖ్యమైన చట్టాలను మార్చడానికి నేపాల్ ప్రభుత్వం రెడీ అయింది.
40 రోజుల సెర్చ్ ఆపరేషన్ క్లోజ్..
వరదలు వచ్చినప్పటి నుంచి దాదాపు 40 రోజుల పాటు సాగించిన శోధన, సహాయక చర్యలకు ప్రభుత్వం ముగింపు పలికింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ వరదల్లో 1,455 మంది చనిపోగా, మరొక 5,285 మంది అసలు ఎక్కడున్నారో తెలియకుండా పోయారు. ఇక వెతుకులాట ముగియడంతో, బాధితులకు ఇళ్లు కట్టించడం, దెబ్బతిన్న ప్రాంతాలను మళ్లీ పునర్నిర్మించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో గల్లంతైన వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తీర్చడమే మెయిన్ టార్గెట్‌గా పెట్టుకుంది.

12 ఏళ్లు ఆగాల్సిన పనిలేదు..
సాధారణంగా నేపాల్ రూల్స్ ప్రకారం ఒక వ్యక్తి కనిపిచకుండా పోతే, అతను చనిపోయాడని గవర్నమెంట్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి కనీసం 12 ఏళ్లు పడుతుంది. లేదా కోర్టు చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కానీ ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల వరద బాధితుల కుటుంబాలకు ఇన్సూరెన్స్, పరిహారం ఏదీ అందడం లేదు. అందుకే ఈ చిక్కులను తీర్చడానికి 'డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్', 'నేషనల్ ఐడెంటిటీ కార్డ్ యాక్ట్'లలో మార్పులు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ సెషన్స్ లేకపోవడంతో, ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఫాస్ట్ ట్రాక్ పద్ధతిలో ఈ కొత్త రూల్స్‌ను తక్షణమే అమల్లోకి తెస్తున్నారు.
బాధితుల కుటుంబాలకు వెంటనే క్లెయిమ్స్!
ఈ చట్ట సవరణల వల్ల గల్లంతైన వారి మరణ నమోదు ప్రక్రియ చాలా ఈజీ అయిపోతుంది. దీనివల్ల వారి కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం, ఇన్సూరెన్స్ డబ్బులు, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న క్యాష్, ఆస్తి హక్కులు ఎలాంటి లీగల్ అడ్డంకులు లేకుండా త్వరగా చేతికి అందుతాయి. సెర్చ్ ఆపరేషన్ అధికారికంగా పూర్తయినప్పటికీ, రీబిల్డింగ్ పనుల్లో ఎక్కడైనా ఆనవాళ్లు లేదా మృతదేహాలు కనిపిస్తే రికవరీ ప్రక్రియ కొనసాగిస్తామని అధికారులు చెప్పారు.














Click it and Unblock the Notifications
