లోయలో పడిన బస్సు: 33 మంది దుర్మరణం
కాంఠ్మాండు: నేపాల్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 33 మంది ప్రయాణికులు సంఘటనా స్థలంలో దుర్మరణం చెందారు. 85 మంది ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి 300 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది.
ఈ ప్రమాదంలో 33 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. 43 మందికి తీవ్రగాయాలైనాయి. బస్సు రాజధాని కఠ్మాండు నుంచి కట్టికె దురాలికి బయలుదేరింది.

మార్గం మధ్యలో అర్ని కో హై వే మీద బస్సుఅదుపుతప్పి లోయలో పడటంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు, నేపాలీ ఆర్మీ రంగంలోకి దిగి క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలించారు.
మట్టిదిబ్బల్లో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీశారు. ఎంతో ఎత్తు నుంచి బస్సు లోయలోకి పల్టీలు కొట్టి కిందకుపడిందని, వారి
మృతదేహాలు నుజ్జునుజ్జు అయ్యాయని ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు చెప్పారు.
ప్రమాదానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని, కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని ఆర్తనాదాలు చేశారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications