Nepal earthquake: 70 మందికి పైగా దుర్మరణం: శిథిలాలు తొలగిస్తోన్న కొద్దీ..!!

ఖాట్మండు: నేపాల్‌లో సంభవించిన పెను భూకంపం (Nepal earthquake).. పలువురిని పొట్టనబెట్టుకుంది. వందలాది మంది గాయపడ్డారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కుప్పకూలిన భవనాల శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలను కొనసాగుతున్నాయి.

శుక్రవారం అర్ధరాత్రి నేపాల్‌ను వణికించింది ఈ భూకంపం. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీ- నేషనల్ క్యాపిటల్ రీజియన్ (Delhi-NCR) సహా ఉత్తరాదిన పలు రాష్ట్రాల్లోనూ భూమి ప్రకంపించింది. వేలాది మంది రోడ్లపై చేరుకున్నారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయి ప్రకంపనలు సంభవిస్తోండటంతో రాత్రంతా రోడ్ల మీదే జాగారం చేశారు.

Nepal earthquake 2023: several feared to dead

నేపాల్ పశ్చిమ ప్రాంతంలోని జాజర్‌కోట్ (Jajarkot), రుకుమ్ వెస్ట్‌ (Rukum West) జిల్లాల్లో అర్ధరాత్రి ఈ భూకంపం సంభవించింది. జాజర్‌కోట్‌కు ఈశాన్య దిక్కున ఉన్న రమిదంద (Ramidanda) అనే గ్రామాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు. ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున ఫలకాల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూకంపం సంభవించినట్లు నేపాల్ నేషనల్ సెస్మాలజీ సెంటర్ తెలిపింది.

దీని తీవ్రతకు జాజర్‌కోట్‌‌, రుకుమ్ వెస్ట్ జిల్లాల్లో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. జాజర్‌కోట్‌లో 34 మంది మరణించినట్లు జిల్లా ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ అధికారి హరీష్ చంద్ర శర్మ తెలిపారు. రుకుమ్ వెస్ట్‌‌లో 35 మంది మృతిచెందినట్లు జిల్లా పోలీస్ అధికారి నామరాజ్ భట్టారాయ్ చెప్పారు. భూకంపం ధాటికి ఈ రెండు జిల్లాల్లో చాలాచోట్ల కొండచరియలు సైతం విరిగిపడ్డాయి.

జాజర్‌కోట్, రుకుమ్ వెస్ట్‌తో పాటు పలు జిల్లాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటన పట్ల నేపాల్ ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగించేలా ఆదేశాలు జారీ చేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరింపజేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.

అదే సమయంలో ఢిల్లీ-ఎన్సీఆర్‌లోనూ భూప్రకంపనలు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, బిహార్‌లల్లోని అనేక జిల్లాల్లో భూమి ప్రకంపించింది. స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గరయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ఇక్కడ ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+