నేపాల్ భూకంపం: ఆర్తనాదాలు, పలు షాకింగ్ వీడియోలు
ఖాట్మాండ్: నేపాల్లోని భూకంప భయానక దృశ్యం సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. ఇది హృదయవిదారకంగా ఉంది. దేశ రాజధాని ఖాట్మాండు మాల్ వద్ద గల ట్రాఫిక్ కెమెరాలో, నేపాల్లోని సుందర జిల్లాలో భూకంప ధాటికి కుప్పకూలిన ఓ భవనం వీడియో సీసీ టీవీకి చిక్కింది.
భూప్రకంపన సమయంలో రోడ్డు మీద ఉన్న ప్రజలు అటూ ఇటూ ఊగారు. వాహనదారులు కూడా కిందపడ్డారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఉన్న బిల్డింగ్ కూడా అకస్మాత్తుగా కుప్పకూలింది.

ఖాట్మాండు మాల్ బయట ట్రాఫిక్ అమర్చిన సీసీ కెమెరాలో.. బిజీ సమయం అయిన 11.52 వీడియో లభ్యమైంది. అందులో ప్రజలు పరుగెత్తుతూ కనిపించారు.
ఓ వీడియోలో కూలుతున్న ఓ ఆలయం వద్ద పలువురు పరుగెడుతున్నారు. తనను తాను కాపాడుకునేందుకు ఓ మోటరిస్ట్ తన వెహికిల్ పై నుండి అటు వైపుగా జంప్ చేశాడు. ఘటన అనంతరం.. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతం. శిథిలాలు, దుమ్ము, దూళితో నిండిపోయింది.
మరో వీడియోలో, రోడ్డు పైన తమ మోటార్ బైకులు నిలివేసి, ప్రజలు కేకలు వేస్తూ పరుగెత్తుతున్నారు. జనాలు భవనాలకు దూరంగా, రోడ్డు పైకి వచ్చి నిలబడ్డారు. మరో ఫుటేజీలో.. ఆలయం కూలింది. భూకంపం నేపథ్యంలో పలువురు నిలదొక్కుకునేందుకు గేటుకు వేళ్లాడారు.












Click it and Unblock the Notifications