నేపాల్‌లో మళ్లీ వరదలు.. 24 మంది మృతి.. భయానక వీడియో నెట్టింట వైరల్

ఆగస్టు 26న నేపాల్ లో సంభవించిన భారీ వరద ప్రళయం నుంచి తేరుకోకముందే మరోసారి నేపాల్ లో వరదలు విజృంభించాయి. ఈ ఆకస్మిక వరదల ధాటికి 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 14 మంది గల్లంతయ్యారు. మూడు రోజులుగా నేపాల్ లోని మనాంగ్, మయాగ్డి, బాగ్లంగ్, పర్బత్ అండ్ పల్పా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ ప్రాంతాల్లో వరదల ధాటికి జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొండ ప్రాంతాల నుంచి వర్షపు నీరు భారీగా కిందకు చేరడంతో కొండ చరియలు విరిగిపడ్డాయి. అలాగే నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో అవి ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జ్ లతోపాటు ఇతర మౌళిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. నేపాల్ లోని అనేక జిల్లాల్లో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ వీడియోలో తమ కళ్ల ముందే కొండ చరియలు విరిగిపడుతున్న క్రమంలో ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు.

నేపాల్ లోని మనాంగ్, మయాగ్డి, బాగ్లంగ్, పర్బత్ అండ్ పల్పా ప్రాంతాలను వరదలు భారీగా ముంచెత్తాయి. అధికారుల సమాచారం ప్రకారం.. బాగ్ లంగ్ ప్రాంతంలో 10 మంది మృతి చెందారు. మయాగ్డి ప్రాంతంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మనాంగ్ ప్రాంతంలో ఇద్దరు, లుంబిని ప్రావిన్స్ లోని పల్పాలో ఐదుగురు మృతి చెందారు. అలాగే ధనూష జిల్లా మిథిలా మున్సిపాలిటీలో వరదల ధాటికి ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే ఈ వరదల ధాటికి 14 మంది గల్లంతయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం.. మనాంగ్ లో 10 మంది గల్లంతు కాగా.. మయాగ్డిలో ముగ్గురు, బాగ్లంగ్ లో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. ఇక లాంజంగ్ లో ఇద్దరు గాయపడ్డారు. వీరితో పాటు బాగ్లంగ్ లో ఒకరు.. మయాగ్డిలో ఒకరు గాయపడ్డారు. ఇక నేపాల్ కు చెందిన నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్ మెంట్ అథారిటీ వివరాలను వెల్లడిస్తూ.. ఈ వరదల్లో కాళీ గంధకీ నది తీవ్రంగా దెబ్బతిందని తెలిపింది. అలాగే నారాయణి, తినావ్ నదులు కూడా వరదల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయని వివరించింది.

NepalFloods strike again 24 dead terrifying video goes viral online Floods Landslides Destruction

ఈ వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో ప్రత్యక్షంగా 747 కుటుంబాలపై ప్రభావం చూపింది. ఇప్పటికే వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. గంధకి ప్రావిన్స్ లో 195 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా.. 26 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 270 ఇళ్లు ప్రమాదంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక దాదాపు 1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక పర్భత్ జిల్లాలో 106 ఇళ్లు ధ్వంసం అయ్యాయి. నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అలాగే 162 ఇళ్లకు చెందిన దాదాపు 540 మంది ప్రజలు వారి ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. ఇక వరదల ధాటికి నేపాల్ లో ఆరు బ్రిడ్జ్ లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అలాగే మరో రెండు బ్రిడ్జ్ లు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+