దిగిపోతూ జో బైడెన్ చేసిన మంచి పని- బెస్ట్ డీల్

Israel and Hezbollah: మధ్య- తూర్పు ఆసియా దేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఇక చల్లారినట్టే కనిపిస్తోంది. దాడులు- ప్రతిదాడులతో అట్టుడికిన ఇజ్రాయెల్- లెబనాన్‌లల్లో క్రమంగా శాంతియుత వాతావరణం నెలకొంటోంది. ఈ రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడమే దీనికి కారణం.

దాదాపు 14 నెలలుగా మధ్య- తూర్పు దేశాలు అగ్నిగుండంగా మారుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్‌ రోజూ పరస్పర దాడులకు దిగేవి. గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వచ్చింది.

Netanyahu announced ceasefire agreement with Hezbollah

ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు.

రోజురోజుకూ భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకుంది. కాల్పుల విరమణ ఒప్పందాలను ప్రకటించింది. ఐరాస భద్రతా మండలి 1701 తీర్మానాన్ని ఆమోదించింది. దీనిపై ఇజ్రాయెల్, లెబనాన్‌తో శాంతి కుదిర్చే బాధ్యతను అమెరికా, ఫ్రాన్స్ తీసుకున్నాయి.

శాంతియుత వాతావరణం నెలకొనడానికి మధ్యవర్తిత్వం వహించాయి. ఈ ఒప్పందాలపై ఇజ్రాయెల్, లెబనాన్‌ దేశాల ప్రతినిధులతో శాంతిచర్చలు జరిపాయి. రెండు వారాలుగా కొనసాగుతూ వస్తోన్న ఈ శాంతి చర్చలు కొలిక్కి వచ్చాయి. కాల్పుల విరమణకు అంగీకరించాయి.

Netanyahu announced ceasefire agreement with Hezbollah

ఈ మేరకు ఇజ్రాయెల ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఓ ప్రకటన చేశారు. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. లెబనాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు తాజాగా ప్రకటించారు. దీన్ని ఏ మాత్రం ఉల్లంఘించినా భీకర దాడులు చేయడానికి ఏమాత్రం వెనుకాడబోమనీ హెచ్చరించారు.

కాల్పుల విరమణ నిబంధనల ప్రకారం- 60 రోజుల్లో ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య అనధికార సరిహద్దు ప్రాంతమైన బ్లూ లైన్ నుంచి వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. లిటానీ నది తీరాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. మిలిటెంట్ల స్థానంలో లెబనాన్ ఆర్మీ దళాలను ఆ ప్రాంతంలో మోహరించాల్సి ఉంటుంది. ఇలాంటి పలు అంశాలపై ఈ రెండు దేశాలు కూడా పరస్పరం అంగీకారానికి వచ్చాయి.

ఇజ్రాయెల్- లెబనాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ హర్షం వ్యక్తం చేశారు. దీన్ని స్వాగతించారు. రెండు దేశాలనూ అభినందించారు. చర్చల ద్వారా అన్ని రకాల సమస్యలను పరిష్కరించుకోవచ్చనే విషయం మరోమారు రుజువైందని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+