ట్రంప్ కల నిజమాయెగా..!!
Donald Trump For Nobel Peace Prize: అత్యున్నత నోబెల్ శాంతి బహుమతిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకోనున్నారా? ఈ పురస్కారం దాదాపుగా ఆయనకు ఖాయమైనట్టేనా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. నోబెల్ శాంతి బహుమతికి అడుగు దూరంలో నిలిచారు ట్రంప్.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం కోసం ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు.. ఆయన పేరును సిఫారసు చేశారు. ఈ అవార్డును పొందడానికి ట్రంప్ కు మించిన అర్హులు మరెవరూ లేరని తేల్చి చెప్పారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడానికి కావాల్సిన అన్ని అర్హతలు కూడా డొనాల్డ్ ట్రంప్ కు ఉన్నాయని, అందుకే ఆయన పేరును నామినేట్ చేస్తోన్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం నెతన్యాహు అమెరికా పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా- వైట్ హౌస్ లో ట్రంప్ తో సమావేశం అయ్యారు. ఆయన ఇచ్చిన విందులో పాల్గొన్నారు. ముఖాముఖి భేటీ ఇది. ఇరు దేశాల విదేశాంగ, రక్షణ, వాణిజ్య మంత్రిత్వ శాఖ మంత్రులు, అధికారులు దీనికి హాజరయ్యారు.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలను స్వీకరించిన అనంతరం నెతన్యాహు ఆయనతో భేటీ కావడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. చిరకాల శతృవు ఇరాన్ పై సాగించిన వైమానిక దాడుల సందర్భంగా తమకు అండగా నిలిచినందుకు ట్రంప్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడారు. నోబెల్ శాంతి బహుమతి కోసం డొనాల్డ్ ట్రంప్ పేరును నామినేట్ చేస్తోన్నానని అన్నారు. ఈ అవార్డును అందుకునే అన్ని అర్హతలు ఆయనకు ఉన్నాయని వ్యాఖ్యానించారు. దీనికి అవసరమైన లేఖను అధికారికంగా నోబెల్ కమిటీకి పంపించినట్లు తెలిపారు.
ఇరాన్ అణు సంక్షోభాన్ని నివారించడం, భారత్- పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని నిలిపివేయడం.. వంటి అంశాలను నెతన్యాహు.. ఈ లేఖలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి.. ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కుదర్చడంలో ట్రంప్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
దీనితో పాటు- కాల్పుల విరమణపై ఇజ్రాయెల్- హమాస్ మధ్య ఖతార్ వేదికగా శాంతి చర్చలను నిర్వహించడంలో అమెరికా ప్రధాన పాత్రను పోషించింది. ఈ నెల 6, 7 తేదీల్లో ఈ చర్చలు కొనసాగాయి. గాజాలో కాల్పుల విరమణకు ఈ వారంలో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications