ఘోర విధ్వంసం:'పారిస్ కుప్పకూలింది' ఐసిస్ వీడియో
పారిస్: భవిష్యత్తులో ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఘోర విధ్వంసం సృష్టిస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఓ వీడియో విడుదల చేసింది. మొన్నటి పారిస్ దాడుల కంటే భయంకరంగా ఉంటాయని పేర్కొంది.
ఇందుకు ఓ ట్రయల్‌గా 'జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా' అనే చిత్రంలోని ఓ వీడియో క్లిప్‌ను జోడించింది. ఈ వీడియో ప్రకారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈఫిల్ టవర్‌ను ఓ క్షిపణి బలంగా ఢీకొట్టడంతోపాటు చిన్న రోబోటిక్ డిస్ట్రాయర్స్ ధ్వంసం చేస్తాయి.

అందరూ చూస్తుంటగా ఈఫిల్ టవర్ కూలిపోతుంది. ఈ వీడియో ద్వారా పారిస్‌కు హెచ్చరికలు పంపించినట్లవుతుందని ఐసిస్ పేర్కొంది. ఈ వీడియోకు... పారిస్ కుప్పకూలిపోయిందని ఓ పేరు పెట్టి మరీ విడుదల చేశారు.
దాదాపు పది రోజుల క్రితం పారిస్‌లో జరిపిన ఉగ్రదాడి చాలా చిన్నదని ఐసిస్ తన వీడియోలో హెచ్చరించింది. ఐసిస్ తాజా గ్రాఫిక్స్ వీడియో నిడివి ఆరు నిమిషాలు ఉంది. సెప్టెంబర్ 11 దాడుల కన్నా తాము జరిపే విధ్వంసం అధికమని తెలిపింది.
-
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్‌కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications