సిద్దార్ధ్ ధర్: 'జిహాదీ జాన్'గా హిందువు (ఫోటోలు)
న్యూఢిల్లీ: ఐసిస్ ఉగ్రవాదుల్లో సరికొత్త 'జిహాదీ జాన్'గా అవతరించి, బందీల పీకలను కోస్తున్న ఓ ఉగ్రవాది గురించి వార్త ఒకటి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. లండన్‌కు చెందిన భారతీయ ఎన్నారై సిద్దార్థ ధర్ కొత్త జిహాదీ జాన్‌గా అవతరించాడని వార్తలు వస్తున్నాయి.
బ్రిటన్ తరుపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో ఐదుగురి తలలను పదునైన కత్తితో కోస్తున్న తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ఆ వీడియోలో లీడర్‌గా కనిపించింది సిద్దార్ధ ధర్‌యేనని బ్రిటన్ మీడియాలో వార్తలు వచ్చాయి.
15 నెలల క్రితం బ్రిటన్ నుంచి సిరియాకు వెళ్లిన సిద్దార్ధ్ మతం మార్చుకుని అబూ రుమైసాహ్‌గా పేరును మార్చుకున్నాడని ఓ ప్రత్యేక కథనాన్ని బ్రిటన్ పత్రికలు ప్రచురించాయి. అంతేకాదు ఐసిస్‌లో చేరిన సిద్దార్ధ్ 'ప్లస్ హాలిడ్ రిసార్ట్' అనే ఈ బుక్‌ను కూడా పబ్లిష్ చేశాడని పేర్కొన్నాయి.

సిద్దార్ధ్ ధర్: 'జిహాదీ జాన్'గా హిందువు
46 పేజీలను కలిగి ఉన్న ఈ ఈ బుక్‌లో జీహాదీగా ఎలా మారాడో కూడా రాసినట్లు వార్తా కథనంలో పేర్కొన్నాయి. గతేడాది మేలో ప్రచురించిన ఈ ఆన్‌లైన్ బ్రోచర్‌లో ఐసీస్ కొత్త వారిని ఎలా రిక్రూట్ చేసుకుంటుందో సవివరంగా వివరించాడు.

సిద్దార్ధ్ ధర్: 'జిహాదీ జాన్'గా హిందువు
లండన్‌లో నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్ధ ఆల్ ముజాహిజిరోన్‌కు మద్దుతు తెలుపుతూ టెర్రరిజం వైపు ఎనిమిది మందిని మళ్లించేందుకు ప్రయత్నించినందుకు గాను సిద్ధార్ద్‌ను నవంబర్ 2014లో లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత మే 2015న బెయిల్‌పై విడుదలైన సిద్ధార్ద్ పాస్‌పోర్టుని పోలీసులకు అప్పగించాడు.

సిద్దార్ధ్ ధర్: 'జిహాదీ జాన్'గా హిందువు
ఆ తర్వాత లండన్ నుంచి పారిస్‌కు వెళ్లిన సిద్ధార్ద్ అటు నుంచి యూరప్ మీదుగా సిరియాకు వెళ్లి ఐసిస్‌లో చేరాడు. సిద్ధార్ద్ ధర్ కొత్త జిహాదీ జాన్‌గా అవతరించండపై అతని చెల్లెలు కొనికా ధర్ స్పందించారు. తన సోదరుడు ఇలా మారడాన్ని తాను నమ్మలేకపోతున్నానన్నారు. ఆ వీడియోను చూసిన కోనికా, "నేనిప్పుడు షాక్ లో ఉన్నాను. అది నా అన్నయ్య గొంతు మాదిరిగానే ఉంది. కానీ, నేను చూసిన క్లిప్ చాలా చిన్నది. పూర్తి నిర్థారణకు రాలేకపోతున్నా" అని వ్యాఖ్యానించారు.

సిద్దార్ధ్ ధర్: 'జిహాదీ జాన్'గా హిందువు
లండన్‌లో హిందువుగా పెరిగిన 32 ఏళ్ల సిద్దార్ధ్ ధర్ తాజాగా విడుదలైన వీడియోలో ఆరంజ్ రంగు దుస్తులను ధరించిన ఐదుగురు వ్యక్తులు మోకాళ్లపై కూర్చోగా, ముఖానికి ముసుగు ధరించిన ఐదుగురు వెనుక నిలబడ్డారు. మధ్యలో ఉన్న వ్యక్తి (సిద్దార్థ్ అని అంచనా) బ్రిటీష్ యాక్సెంట్‌లో డేవిడ్ కామెరూన్‌ను హతమారుస్తామని హెచ్చరించాడు. ఆ తర్వాత ఐదుగురి పీకలను కోసి హతమార్చాడు.
-
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత












Click it and Unblock the Notifications