హెచ్1బీ వీసా ఇక వారిష్టం! ఇండియన్ ఐటీ సంస్థలు, టెక్కీలపై ప్రభావం
వాషింగ్టన్: హెచ్1బీ వీసాదారులు మరింత ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. అమెరికా పౌర, వలస సేవల విభాగం (ఊఎస్ఐఎస్) ఇటీవల నిబంధనల్ని కఠినం చేసింది. హెచ్1బీ వీసా దరఖాస్తులను ఆమోదించేందుకు కఠిన వైఖరి అవలంభిస్తోంది. హెచ్1బీ దరఖాస్తుదారులు ఎక్కువగా ఉంటుండటంతో... దరఖాస్తుల్లో తప్పులు లేదా లోపాలు ఉంటే ఎలాంటి సమాచారం లేకుండా తిరస్కరించే అధికారం ఉంది.
దరఖాస్తు బాగుందని యూఎస్ఐఎస్‌కు అనిపిస్తే ఆమోదం లభిస్తుంది. దరఖాస్తు తిరస్కరణకు కారణాలు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొత్త పాలసీ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి అమలులోకి రానుంది. తమ దరఖాస్తు తిరస్కరణకు గురైతే వారు దేశం విడిచి వెళ్లవలసి ఉంటుంది. లోపాలు లేకున్నా తిరస్కరణకు గురైనట్లు భావిస్తే న్యాయస్థానానికి వెళ్లవచ్చు.

హెచ్1బీ తిరస్కరణకు గురైతే దేశం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేస్తారు. దేశం విడిచి వెళ్లకుంటే ఎన్టీఏ జారీ చేస్తారు. అప్పటికి వెళ్లకుంటే పదేళ్లపాటు అమెరికా రాకుండా చేస్తారు. ఈ నిర్ణయం ఇండియన్ సాఫ్టువేర్ ఉద్యోగులు, ఐటీ కంపెనీలపై బాగా ప్రభావంపడనుంది.
దరఖాస్తుదారు న్యాయస్థానంలో అప్పీల్ చేసుకున్నంత మాత్రాన గతంలో మాదిరిగి ఉద్యోగం చేయడానికి అర్హత ఉండదు. అప్పీల్ పరిష్కారమయ్యే వరకు గరిష్టంగా 240 రోజులు అమెరికాలో ఉండవచ్చు.












Click it and Unblock the Notifications