'మద్యం సేవించే మహిళలు.. కండోమ్ లేకుండానే'
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా ఆల్కాహాల్ సేవించేవాళ్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా యువత ఎక్కువగా మద్యానికి ఆకర్షితులవుతుండడంతో.. అంతే స్థాయిలో అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. అమెరికాలో పరిశోధకుల తాజా పరిశోధనలో కొన్ని విస్తు గొలిపే విషయాలు బయటపడ్డాయి.
అమెరికాలోని సిన్సినాటి పరిశోధకులు జరిపిన మెడిసిన్ జర్నల్ లో భాగంగా.. మద్యం సేవించడం విషయంలో మొత్తం 287 మంది కాలేజీ అమ్మాయిలపై పరిశోధన జరిపారు. ఇందులో తేలిందేంటంటే.. లైంగిక చర్యకు ముందు మద్యం అధికంగా సేవించే మహిళలు.. అనంతరం శృంగారంలో విపరీత ధోరణితో ప్రవర్తిస్తారని తేలింది.

పరిశోధన వివరాలను వెల్లడించిన ప్రొఫెసర్ బ్రౌన్ మాట్లాడుతూ.. మద్యం సేవించే 66.9 శాతం మంది మహిళలు.. మద్యపానం అనంతరం కండోమ్ ను ఉపయోగించకుండా అసురక్షిత శృంగారంలో పాల్గొని హెచ్ఐవీ లాంటి వ్యాధుల బారిన పడుతున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications