హిల్లరీ లేదా ట్రంప్: ఎవరు గెలిచినా 100 రోజుల్లో మోడీని కలవాలి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా పదవీ కాలం మరో వంద రోజులు ఉంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్ లేదా డొనాల్డ్ ట్రంప్ గెలవనున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఎవరు గెలిచినా భారత ప్రధాని నరేంద్ర మోడీని వంద రోజుల్లో కలవాలని అమెరికా థింక్ త్యాంక్ అనే సంస్థ సర్వేలో తేలింది.

ఎవరు గెలిచినా..
తద్వారా ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగిస్తామని బలమైన సంకేతాలు ఇవ్వాలని పేర్కొంది. నవంబరు 8న దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరఫున హిల్లరీ క్లింటన్ పోటీ చేస్తున్నారు.

భారత్‌తో మంచి సంబంధాలు
అయితే కొత్తగా ఎన్నికై వైట్ హౌస్‌లోకి వెళ్లే వాళ్లు ఎవరైనా భారత్‌తో మంచి సంబంధాలు కొనసాగించాల్సి ఉంటుందని ఓ సంస్థ 'ఇండో-అమెరికాలు భద్రతపై పరస్పర సహకారం' అంశంపై ఇచ్చిన నివేదికలో వెల్లడించింది. కొత్తగా ఎన్నికయ్యే వారు భారత్-అమెరికాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసే దిశగా కృషి చేయాలని పేర్కొంది.

కీలక ఒప్పందాలు
కీలక ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరముందని సూచించింది. కొత్త ప్రభుత్వం ఆస్ట్రేలియా, భారత్, జపాన్‌లతో కలిసి పని చేయాలని, పసిఫిక్, హిందూ మహాసముద్ర ప్రాంతంలో అందరికీ ఆసక్తికర అంశాలపై దృష్టి పెట్టాలని వెల్లడించింది.

సన్నిహితంగా మెలిగిన ఒబామా
భారత్‌తో చక్కని ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించాలని పేర్కొంది. ఉగ్రవాద నిర్మూలన కోసం తాలిబన్లతో జరిపే చర్చలకు అమెరికా కొత్త ప్రెసిడెంట్ భారత్‌ను ఆహ్వానించాలని పేర్కొంది. ప్రస్తుత అధ్యక్షులు బరాక్ ఒబామా ప్రధాని నరేంద్ర మోడీతో సత్సంబంధాలు నెలకొల్పారు.












Click it and Unblock the Notifications