న్యూయార్క్: ఘోర అగ్నిప్రమాదం.. అపార్ట్మెంట్లో 19 మంది మృతి

అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ఒక అపార్ట్మెంట్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో తొమ్మిది మంది చిన్నారులు సహా 19 మంది చనిపోయారు.
మరో 32 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
మొత్తం 19 అంతస్తుల అపార్ట్మెంట్ భవనంలో సంభవించిన ఈ అగ్నిప్రమాదంలో దట్టమైన పొగ అలముకుందని.. ప్రతి అంతస్తులోనూ ప్రమాద బాధితులు కనిపించారని అగ్నిమాపక విభాగం కమిషనర్ డేనియర్ నీగ్రో చెప్పారు.
ఇలాంటి ప్రమాదంలో ఇంత భారీ సంఖ్యలో చనిపోవటం గడచిన మూడు దశాబ్దాల్లోనే ఇదే అత్యధికమని ఆయన ఎన్బీసీ న్యూస్‌కు తెలిపారు.
కొద్ది రోజుల కిందట ఫిలడెల్ఫియాలోని ఒక అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం జరిగి ఎనిమిది మంది చిన్నారులు సహా 12 మంది చనిపోయారు.
- 2021లో తీవ్రంగా విరుచుకుపడిన ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలే కారణమా?
- 'గర్ల్స్ డు పోర్న్’ బాధిత మహిళలకే ఆ వీడియోలపై హక్కులు, పరిహారం

న్యూయర్క్‌లోని బ్రాంక్స్ ప్రాంతంలో ఉన్న అపార్ట్మెంట్ బ్లాక్‌లో రెండు, మూడు అంతస్తుల్లో స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయని అధికారులు చెప్పారు.
విద్యుత్ హీటర్‌లో లోపం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు వారు భావిస్తున్నారు. మంటలను ఆర్పటానికి దాదాపు 200 మంది సిబ్బంది రంగంలోకి దిగారు.
రెండు అంతస్తులకు మంటలు వ్యాపించాయని.. మంటలు మొదలైన అపార్ట్మెంట్ తలుపు తెరిచి ఉండటంతో దట్టమైన పొగ అన్ని అంతస్తులనూ కమ్మేసిందని కమిషనర్ నీగ్రో విలేకరులకు తెలిపారు.
అగ్నికీలలు చుట్టుముడుతుండగా అపార్ట్మెంట్లో ఉన్నవారు కిటికీల నుంచి కేకలు వేస్తూ కనిపించారని సమీపంలో నివసిస్తున్న జార్జ్ కింగ్ ఏఎఫ్‌పీ వార్తా సంస్థతో చెప్పారు.
''దట్టంగా పొగ అలుముకుంది. జనం భయపడిపోయి కేకలువేస్తున్నారు. బిల్డింగ్ మీద నుంచి దూకటానికి ఎవరూ సాహసించలేదు’’ అని ఆయన తెలిపారు.
- హామ్ట్రాక్: ముస్లింలు పాలిస్తున్న అమెరికా నగరం
- మెక్సికో: కొడుకు కోసం ఎదురుచూస్తున్న తల్లి.. బైక్‌పై వచ్చి కాల్చి చంపిన దుండగులు

మొత్తం 63 మందికి గాయాలయ్యాయని, వారిలో 32 మందిని ఆస్పత్రులకు తరలించామని మేయర్ సలహాదారు స్టీఫెన్ రింగెల్ ఏపీ వార్తా సంస్థతో చెప్పారు. క్షతగాత్రుల్లో 13 మంది పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఈ ప్రమాదం పెను విషాదమని.. బాధితులకు సహాయం చేయటానికి సహాయ నిధిని ఏర్పాటు చేస్తామని న్యూయార్క్ గవర్నర్ కేథీ హోచుల్ హామీ ఇచ్చారు.
''కొత్త ఇళ్లు కట్టటానికి, అంత్యక్రియలు నిర్వహించటానికి, ఇతరత్రా అవసరాలన్నిటికీ నిధులు అందిస్తాం’’ అని ఆమె చెప్పారు.
ఈ అగ్ని ప్రమాదం సంభవించిన బ్రాంక్స్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ముస్లిం వలస జనాభా నివసిస్తున్నారు. ఈ ప్రమాద బాధితుల్లో ఎక్కువ మంది గాంబియా నుంచి అమెరికాకు వలస వచ్చిన వారుగా భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- అరుణాచల్‌ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు చైనీస్ పేర్లు పెట్టిన చైనా, తీవ్రంగా స్పందించిన భారత్
- పుష్ప-సమంత: 'ఊ అంటావా మావా..’ పాట ఐటెం సాంగ్ పంథాను తిరగరాస్తుందా? 'మగ బుద్ధి’ గురించి చంద్రబోస్ ఏమన్నారు?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- జేమ్స్ బాండ్: డేనియల్ క్రెయిగ్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరు?
- కృతి శెట్టి: 'శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’
- 'శకుంతలా దేవి నా జాతకం చూసి తోడు దొరకదని చెప్పారు.. ఇప్పటికీ ఒంటరిగానే ఉన్నాను’
- నటుడు విజయ్ సేతుపతిపై రూ.3 కోట్ల పరువు నష్టం దావా.. బెంగళూరు విమానాశ్రయం దాడిలో ఏం జరిగింది?
- మైక్ టైసన్: విజయ్ దేవరకొండ 'లైగర్'లో ఈ బాక్సింగ్ హీరో ఏం చేస్తున్నాడు?
- ప్రేమ, విరహం, భక్తి, రక్తి, విప్లవం, వినోదం అన్నీ తెలిసిన కలం
- కరుణ కుమార్: పలాస, శ్రీదేవి సోడా సెంటర్ల నుంచి మెట్రో కథల వరకు..
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications