న్యూయార్క్‌లో పేలుడు: ఒకరి మృతి, భయానకం

న్యూయార్క్: అమెరికా న్యూయార్క్ నగరంలోని తూర్పు ప్రాంతంలో ఓ ఆపార్టుమెంటులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో రెండు భవనాలు కూలిపోయినట్లు న్యూయార్క్ అధికారులు చెప్పారు. భవనాల శిథిలాల కింద కొంత మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
పేలుడు తీవ్రతకు మంటలు భారీ ఎత్తున వ్యాపించడంతో ఈ ప్రాంతంలో పొగలు వ్యాపించాయి. అనేక వాహనాలపై శిథిలాలు పడడంతో ధ్వంసమయ్యాయి. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు. భారీ పేలుడు శబ్దానికి ప్రజలు భయంతో పరుగులు తీశారు. ఈ ప్రమాదంలో ముందు జాగ్రత్తగా అనేక మెట్రో రైలు సర్వీసులను అధికారులు రద్దు చేశారు.
భవనాల శిథిలాలు రోడ్డుపై పడ్డాయి. భవనం నుంచి పొగులు విరజిమ్మాయి. పేలుడు సంభవించిందని, భవనం కూలిపోయిందని అధికారులు తెలిపారు. మంటలను ఆర్పడంలో అగ్నిమాపక సిబ్బంది నిమగ్నమైంది.
ఆరంతస్థుల భవనంలో చాలా మంది నివసిస్తున్నారని చెబుతున్నారు. సంఘటన తర్వాత అక్కడ హై అలర్ట్ ప్రకటించారు.












Click it and Unblock the Notifications