కరోనా విలయం: అమెరికాలో శవాల గుట్టలు.. వాటిని ఏం చేస్తున్నారో తెలుసా?

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఇతర ముఖ్య అధికారులు అంచనా వేసినట్లే, ఈ వారం అత్యంత భయానకంగా గడుస్తున్నది. శుక్రవారం ఉదయం నాటికి అక్కడ కొవిడ్-19 కేసుల సంఖ్య 4.69లక్షలకు చేరింది. అందులో 26వేల మంది వ్యాధి నుంచి కోలుకోగా, భారీ స్థాయిలో 16,697మంది చనిపోయారు. ఇందులో సగానికి సగంమంది ఆర్థిక రాజధాని న్యూయార్క్ లో కన్నుమూసినవాళ్లేకావడం గమనార్హం.

అంత్యక్రియల పాట్లు..

అంత్యక్రియల పాట్లు..

మహానగరం న్యూయార్క్ తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎటుచూసినా శవాల గుట్టలు దర్శనమిచ్చే పరిస్థితి. అమెరికాలో కరోనా వైరస్ ఎపిసెంటర్ గా గుర్తింపుపొందిన న్యూయార్క్ లో ఇప్పటిదాకా 1.61లక్షల మందికి వైరస్ సోకగా, అందులో 7,067మంది చనిపోయారు. మామూలు రోజుల్లోనైతే మృతులకు ఆయా కుటుంబాలు తగిన రీతిలో అంత్యక్రియలు జరిపేవి. కానీ ఇప్పుడలా లేదు. సిటీలోని సెమెట్రీలన్నీ నిర్విరామంగా పనిచేస్తున్నా అంత్యక్రియలు పూర్తిచేయలేకపోతున్నాయి. దీంతో న్యూయార్క్ మేరయ్ ఆండ్రూ కౌమో.. పక్క రాష్ట్రాల నుంచి ఫ్యునరల్ డైరెక్టర్లను పిలిపించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. మరోవైపు..

హార్ట్ ల్యాండ్ దీవి సామూహిక..

హార్ట్ ల్యాండ్ దీవి సామూహిక..

కొవిడ్-19తో చనిపోయిన వారి దేహంలో కొన్ని గంటలపాటు వైరస్ బతికే ఉంటుందని తేలడంతో.. బాధను దిగమింగుతూ కొద్దిమంది తమ వాళ్ల మృతదేహాలను తీసుకెళ్లలేకపోతున్నారు. వాటికితోడు అనాథ శవాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. దీంతో అధికారులు.. న్యూయార్క్ సమీపంగా ఉండే హార్ట్ ఐలాండ్ లో సామూహిక ఖననాలు జరుపుతున్నారు. మైలు పొడవుండే ఈ చిన్న దీవిని దాదాపు 200 ఏళ్లుగా ఖననాల కోసమే వాడుతున్నారు. 1919నాటి స్పానిష్ ఫ్లూ మహమ్మారితో చనిపోయినవారిలో చాలా మందిని ఇక్కడే పాతిపెట్టారు. 1985లో అమెరికాలో తొలి ఎయిడ్స్ రోగిని కూడా ఇక్కడే ఖననం చేశారు. మళ్లీ కరోనా మహమ్మారి కారణంగా ఇక్కడ ఖననాల సంఖ్య భారీగా పెరిగింది.

మార్చురీలు నిండుకోవడంతో..

మార్చురీలు నిండుకోవడంతో..

న్యూయార్క్ సిటీలో కొవిడ్-19 మరణాలు భారీగా ఉండటంతో మార్చురీలన్నీ నిండుకున్నాయి. కొత్త చట్టం ప్రకారం 14 రోజుల్లోగా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే, ఆ మృతదేహాలను ప్రభుత్వమే ఖననం చేయిస్తుంది. అయితే ఇప్పుడు హార్ట్ ఐలాండ్ కు తరలిస్తున్నవన్నీ అనాథ శవాలేనని చెప్పడానికి వీల్లేదని అధికారులు అంటున్నారు. ఇదివరకు ఇక్కడ సామూహిక ఖననాల పనిని జైలు ఖైదీలతో చేయించేవారు. కానీ కరోనా భయాల నేపథ్యంలో ఖైదీలను బయటికి రానివ్వడంలేదు. భారీ వేతనాలు చెల్లించిమరీ, వర్కర్లను పనిలోకి తీసుకున్నారు. ప్రస్తుతం హ‌ర్ట్ ఐలాండ్‌లో ప్రతిరోజూ పాతిక ఖననాలు జరుగుతున్నట్లు అధికారులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+