coronavirus: శవాల దిబ్బగా మారిన న్యూయార్క్, 10 వేలకు పైగా మృతి...
అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్ గజ గజ వణికిస్తోంది. వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇక న్యూయార్క్‌లో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. సోమవారం నాటికి న్యూయార్క్‌లో 10 వేల మంది చనిపోయారని గవర్నర్ ఆండ్రూ క్యుమో తెలిపారు. గత 24 గంటల్లో 671 మంది చనిపోయారని వివరించారు. వీరితో కలిపి 10 వేల 56 మంది మృతిచెందారని వెల్లడించారు. న్యూయార్క్‌లో పరిస్థితి మరింత దిగజారిందని ఆండ్రూ పేర్కొన్నారు. రాష్ట్రంలో పాజిటివ్ కేసులతోపాటు... మరణాలు కూడా అదేస్థాయిలో పెరుగుతున్నాయి.

కరోనా వైరస్‌తో అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో అత్యధిక మంది చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య లక్ష 17 వేలకు చేరుకుంది.4 లక్షల 43 వేల మంది కోలుకోగా.. 16 లక్షల పైచిలుకు మంది వైరస్‌తో పోరాడుతున్నారు. ఇదిలాఉంటే మరోవైపు రష్యాలో పరిస్థితి దిగజారుతోందని దేశ అధ్యక్షుడు పుతిన్ అంగీకరిచారు. అవసరమైతే రక్షణశాఖ వనరులు, సైనిక వైద్య సిబ్బంది సాయం తీసుకుంటామని చెప్పారు. సోమవారం సీనియర్ అధికారులతో పరిస్థితిని సమీక్షించారు. మరికొద్ది రోజుల్లో వైరస్‌ను సమూలంగా అరికడతామనే ధీమాను పుతిన్ వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications