చీకటి నుంచి వెలుగులోకి: ఒకప్పుడు పోర్న్ స్టార్... ఇప్పుడు మత బోధకురాలు

ఒకప్పటి పోర్న్ స్టార్ క్రిస్టల్ బస్సెట్టె ప్రస్తుతం ఓ చిన్న టౌన్.. ఫాల్టన్ లోని చర్చిలో మత బోధకురాలిగా మారింది.

న్యూయార్క్: ఏడాదికి దాదాపు రూ.2 కోట్ల సంపాదన.. విలసవంతమైన జీవితం.. వందకుపైగా పోర్న్ చిత్రాల్లో నటించి పోర్న్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ఒక్క సంఘటనతో వీటన్నింటినీ వదిలేసింది.

ఒకప్పటి పోర్న్ స్టార్ క్రిస్టల్ బస్సెట్టె ప్రస్తుతం ఓ చిన్న టౌన్.. ఫాల్టన్ లోని చర్చిలో మతబోధకురాలిగా మారింది. చిన్నతనంలోనే లైంగిక దాడికి గురైన బస్సెట్టె పదహారేళ్లకే గర్భం దాల్చింది. తన కుమారుడు జస్టిన్ కు అండగా నిలవాలనుకుంది. వెంటనే కాలిఫోర్నియా నుంచి హాలీవుడ్ కు మకాం మార్చింది.

డబ్బు కోసం...

డబ్బు కోసం...

ముందుగా మోడలింగ్, తరువాత డబ్బు కోసం బార్లలో నృత్యం కూడా చేసింది. ఓ అడల్ట్ చిత్రాల ఏజెంట్ ఆమెకు పోర్న్ చిత్రాల్లో నటించే అవకాశం కల్పించాడు. నెలకు రూ.20 లక్షలు సంపాదించే అవకాశం దొరకడంతో బస్సెట్టె వెనకాముందు ఆలోచించుకోకుండా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పేసింది.

అవి చీకటి రోజులే...

అవి చీకటి రోజులే...

అనంతరం కొద్దిరోజులకే మలిబూ హౌస్ లో తొలిసారి పోర్న్ మూవీలోని ఓ సన్నివేశంలో నటించింది. ‘‘ఆ రోజు తొలిసారి పోర్న్ మూవీలో నటించిన తరువాత దాదాపు రెండు గంటలు షవర్ కింద కూర్చేని ఏడ్చాను. ఆ చిత్రం షూటింగ్ పూర్తయిన తరువాత నెల రోజుల వరకు మరో షూటింగ్ కు వెళ్లలేదు. పోర్న్ చిత్రాల్లో నటించే సమయంలో స్పర్శ లేకుండా ఉండడానికి మద్యం సేవించేదాన్ని, ఇంకా నొప్పి తెలియకుండా ఉండేందుకు కొన్ని మందులు వాడేదాన్ని..'' అని తన చీకటి రోజులను బస్సెట్టె గుర్తుచేసుకుంది.

నాడియా హిల్టన్ పేరుతో...

నాడియా హిల్టన్ పేరుతో...

నాడియా హిల్టన్ పేరుతో అనేక పోర్న్ చిత్రాలలో నటించిన బస్సెట్టె కొద్దికాలంలోనే పోర్న్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత సంపాదించిన డబ్బుతో మలీబుూలోనే అత్యంత విలాసవంతమైన భవంతి, ఖరీదైన ఫెరారీ కారుతోపాటు మరో ఆరు కార్లు కూడా కొనేసింది.

కొడుకు స్కూలుకి.. తను షూటింగ్ కి

కొడుకు స్కూలుకి.. తను షూటింగ్ కి

కొడుకుని స్కూల్లో వదిలి.. అటునుంచటే షూటింగ్ కు వెళ్లడం ఆమె దినచర్యగా మారింది. అయితే 2014 మే నెలలో జరిగిన ఓ సంఘటన బస్సెట్టె తలంపులను, జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తాగిన మత్తులో ఆమె నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు కూడా నమోదైంది.

జీవితంలో అదే పెద్ద మలుపు...

జీవితంలో అదే పెద్ద మలుపు...

ఈ ప్రమాదంతో మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ఆమె తాను ఎవరికోసం బతుకుతోందో కూడా అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో తన పోర్న్ స్టార్ జీవితానికి ముగింపు పలికి, కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారితో కలిసి ఉండడం ప్రారంభించింది.
ఒకరోజు చర్చిలో తన సోదరి వివాహానికి హాజరైన సమయంలో బస్సెట్టె పాస్టర్ డేవిడ్ ను కలుసుకుంది. తరచూ తన సోదరితో కలిసి చర్చికి వెళుతుండడంతో ఆమె గత జీవితం కూడా ఆయనకు తెలిసింది. అయితే ఆమె గతాన్ని పట్టించుకోకుండా పాస్టర్ డేవిడ్ ఆమెను వివాహం చేసుకున్నాడు. తరువాత వారిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు. భర్త డేవిడ్ సహకారంతో ఆమె పాస్టర్ ట్రైనింగ్ తీసుకుంది. ఇద్దరూ కలిసి ఓ చర్చిని సొంతంగా నిర్మించి అక్కడే కొత్త జీవితం ప్రారంభించారు.

ఇది నాకు పునర్జన్మ...

ఇది నాకు పునర్జన్మ...

కారు ప్రమాదం నుంచి బయటపడడం అనేది దేవుడు నాకిచ్చిన పునర్జన్మగా నేను భావించాను. ప్రస్తుతం నా గురించి ఎవరు ఏమనుకుంటున్నరో నేను ఆలోచించడం లేదు. డబ్బు సంపాదనపై అసలు నా దృష్టి లేదు. పేదలకు సహాయం చేయడం, మంచి వాక్యాలు బోధించడంపైనే నా దృష్టి అంతా..'' అంటోంది బస్సెట్టె.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+