వద్దని చెప్పినా: వెయిట్రెస్ పోనీటేల్ లాగిన ప్రధాని, క్షమాపణ

వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జాన్ కీ ఓ వెయిట్రెస్ పోనీ టెల్ లాగి, అనంతరం క్షమాపణలు చెప్పాడు. అక్లాండులో ఓ వెయిట్రెస్ వేసుకున్న పోనీ టెయిల్ పట్టుకొని ప్రధాని జాన్ కీ లాగాడు. దానిని ఆమె వేధింపులుగా భావించింది. దీంతో అతను క్షమాపణ చెప్పక లేదు.

తాను ఆమెను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశ్యంతో అలా చేయలేదని, అయినా ఇబ్బంది పడి ఉంటే తాను క్షమాపణ చెప్పానని ఓ ప్రతినిధి ద్వారా ఆయన తెలిపారు. అంతేకాదు, ఆయన జాతి మొత్తానికి క్షమాపణలు చెప్పాడు.

New Zealand PM John Key apologises for hair pulling

టర్కీ వెళ్తున్న జాన్ కీ లాస్ ఏంజిలిస్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. సాధారణంగా ప్రాక్టికల్ జోకులు వేయడం తనకు ఇష్టమని, అందుకు ఆమె బాధపడినట్లు తెలియగానే క్షమాపణలు చెప్పానని అన్నారు. ఆమెకు వన్ ఇచ్చి క్షమాపణలు చెప్పగానే, ఆమె దానికి సరేనని చెప్పిందన్నారు.

పాఠశాలలో తోటి పిల్లల జడ పట్టుకొని లాగినట్లుగా, ఆయన కూడా తన జుట్టుతో ఆడుకున్నారని బాధితురాలైన వెయిట్రెస్ చెప్పింది. ఆమె తన బ్లాగ్‌లో ఈ విషయం రాశారు. అతను పలుమార్లు తన పోనీ టెయిల్‌ను లాగాడని, తాను వద్దని చెప్పినా వినలేదని పేర్కొంది. ఇది విమర్శలకు దారి తీసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+