వెడ్డింగ్ వీడియో షూట్: ఆ కొత్త జంటకు తప్పిన పెను ప్రమాదం(వీడియో)
వాషింగ్టన్: ఆ ప్రేమ జంట.. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య ఆనందోత్సాహాలతో ఒక్కటయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో వీడియో షూట్, ఫొటో షూట్ కార్యక్రమాల్లో వారిద్దరు పాల్గొన్నారు. ఈ సమయంలో వారికి పెను ప్రమాదం తప్పడంతో ఆ జంటతోపాటు వేడుకకు వచ్చిన అతిథులంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆ వివరాల్లోకి వెలితే.. చెయన్నె, లుకాస్ అనే జంట వెడ్డింగ్ వీడియో షూట్ చేసుకుంటోంది. ఈ క్రమంలో ఓ చెట్టు కింద ఉన్న బల్లపై కూర్చున్నారు. వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో వారికి ఏదో శబ్ధం వినిపించింది. వెంటనే పైకి చూసి అక్కడ్నుంచి పరుగెత్తారు.
క్షణంపాటులోనే వారున్న బల్లపై భారీ చెట్టు కొమ్మ విరిగిపడింది. ఆ జంటకు పెను ప్రమాదం తప్పడంతో ఆ కార్యక్రమం సంతోషాల మధ్య ముగిసింది. కాగా, చెయెన్నె, లుకాస్ జంట వివాహం జూన్ 30న జరిగింది. దానికి సంబంధించిన వెడ్డింగ్ వీడియో టీజర్‌ను జులై 3న ఫేస్‌బుక్‌లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.

'వారి బంధం చెట్టుకంటే బలంగా ఉంటుంది' అని ఓ నెటిజన్ ఈ వీడియోను ఫేస్ బుక్‌లో పోస్టు చేశారు. , 'ఓంఎంజీ! వారు క్షేమంగా ఉన్నారు. అందమైన పెళ్లి వీడియో' అని మరికొందరు నెటిజన్లు స్పందించారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications