వ్యాక్సిన్ తీసుకోలేదు.. అంతే.. ఉద్యోగం గోవిందా.. ఎక్కడ అంటే
కరోనాకు వ్యాక్సిన్ శ్రీ రామరక్ష.. కరోనా నుంచి బయటపడాలి అంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం కావడంతో వేగంగా వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నారు. ప్రపంచం మొత్తం కరోనాను ఎదుర్కొంటున్న సమయంలో కరోనాను పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టి జీరో కరోనా దేశంగా గుర్తింపు పొందింది న్యూజిలాండ్. ఇటీవల అక్లాండ్‌లో డెల్టా కేసు ఒకటి బయటపడటంతో వెంటనే దేశంలో మూడు రోజులపాటు లాక్‌డౌన్ విధించారు. ఇప్పుడు ఇదే విధమైన మరో కఠిన నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 1 వరకు ఫ్రంట్‌లైన్ వర్కర్లు, టీచర్స్ పూర్తిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ఒకవేళ ఎవరైనా వ్యాక్సిన్ తీసుకోకుంటే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని న్యూజిలాండ్ విద్యాశాఖ ప్రకటించింది. కరోనా కట్టడి విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే తీసుకోవాల్సిందేనని విద్యాశాఖ తెలియజేసింది.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
Recommended Video
రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మాస్క్ ధరించి.. శాని టైజర్ రాసుకొని కాలం వెళ్లదీయాల్సిందేనని నిపుణులు సజెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టడం కాస్త ఊరట కలిగించే అంశం.












Click it and Unblock the Notifications