ఫ్రాన్స్ దాడి: స్త్రీ అరెస్ట్, 'అతనో తిరుగుబోతు, స్త్రీలోలుడు'
ప్యారిస్: బాస్టిల్ డే సందర్భంగా ట్రక్ ఢీకొట్టి 84 మంది మృతికి కారణమైన టెర్రర్ దాడి కేసులో పోలీసులు ఓ వ్యక్తిని, మరో మహిళను అరెస్టు చేశారని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. మొత్తం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
ట్రక్‌తో దాడికి పాల్పడిన మొహమ్మద్ లాహౌజ్ మాజీ భార్య కూడా అరెస్టైన వారిలో ఉన్నారు. పోలీసులు శుక్రవారం నాడు ఇద్దరిని, శనివారం నాడు ముగ్గురిని అరెస్టు చేశారు.
లాహౌజ్ తాగుబోతు, తిరుగుబోతు
నైస్‌లో రక్తపాతం సృష్టించిన మొహమ్మద్ లాహౌజ్ ఓ తాగుబోతు, తిరుగుబోతు అని తెలుస్తోంది. ట్యూనిషియాలోని ఎంసేకెన్ పట్టణంలో జన్మించిన అతను, ఫ్రాన్సులో డ్రైవర్‌గా పని చేస్తూ చట్టబద్ధంగా నివసిస్తున్నాడని తెలుస్తోంది.
అతను స్థిరచిత్తం లేనివాడు అని చెబుతున్నారు. తాగుబోతు, స్త్రీలోలుడు అని అంటున్నారు. తమ కుమారుడు ఒక్కోసారి విపరీతంగా ప్రవర్తించేవాడని అతని తల్లిదండ్రులు కూడా చెబుతున్నారు. కోపం వచ్చినప్పుడు ఏది దొరికితే దానిని పగులగొట్టేవాడు.

దీంతో, అతడు సైకోనా అన్నది సందిగ్ధంగా మారింది. అతడు తమ జీహాదీ యోధుడేనని ఉగ్రవాద సంస్థ ఐసిస్ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఫ్రెంచ్ పోలీసులు దీంతో విభేదిస్తున్నారు. అతడు మామూలు క్రిమినల్ అని, ఇస్లాం పట్ల ఆసక్తే లేని వ్యక్తి అని, మానసిక ప్రవర్తన సరిగా లేదని, సైకో కావచ్చంటున్నారు.
బాస్టిల్ డే సందర్భంగా ట్రక్ ఢీకొట్టి 84 మంది మృతికి కారణమైన టెర్రర్ దాడి కేసులో పోలీసులు ఓ వ్యక్తిని, మరో మహిళను అరెస్టు చేశారని ఆదివారం నాడు వార్తలు వచ్చాయి. మొత్తం పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications