చమురు దొంగిలిస్తుండగా విష వాయువు లీక్.. 37 మంది మృతి.. ఎక్కడంటే?

ఇరాన్- అమెరికా యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిలో ఆంక్షల కారణంగా ప్రపంచ దేశాలు చమురు, గ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలతోపాటు పేద, మధ్య తరగతి దేశాల్లో చమురు సంక్షోభం నెలకున్న దుస్థితి ఏర్పడింది. ఇక అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో పరిస్థితి దారణంగా మారింది. అక్కడ చమురు కొరతతో పాటు ఉన్న చమురును కొనుగోలు చేసే సామర్థ్యం లేక దోపిడీకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే నైజీరియాలో జరిగింది. ముడి చమురును దొంగింలించే ప్రయత్నంలో విష వాయువు లీక్ అయింది. దాంతో 37 మంది మృతి చెందారు.

ఈ ఘోర ప్రమాదం నైజీరియాలోని రివర్స్ రాష్ట్రంలో జరిగింది. ఓక్ రికా ప్రాంతంలోని ఒకారీ జెట్టి లో పైప్‌ లైన్‌ నుంచి ముడి చమురును దొంగిలించి పడవలోకి తరలిస్తుండగా ప్రమాదవశాత్తూ విష వాయువు లీక్ అయింది. దాంతో ఈ ప్రమాదంలో 37 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొద్ది మంది పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం దర్యాప్తు నిర్వహిస్తున్నామని నైజీరియన్ పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే ఘటనపై రివర్స్ స్టేట్ అధికార ప్రతినిధి బ్లెస్సింగ్ అగాబే మాట్లాడుతూ.. బాధితులంతా చమురును దొంగిలించే క్రమంలో ప్రమాదం జరిగనట్లు వివరించారు. మృతుల వివరాలు నైజీరియన్ పోలీసులు ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు.

Nigeria Horrific accident Fuel Theft 37 killed while stealing oil from pipes Horrific accident

"స్థానికంగా ఓ రిఫైనరీకి చమురును సరఫరా పైపుల నుంచి కొందరు యువకులు ట్యాపింగ్ పాయింట్ వద్ద తమ పైపులను అమర్చి పడవల్లోని ట్యాంకర్లకు చమురును తరలించే ప్రయత్నం చేశారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ పైపు నుంచి విష వాయువు లీక్ అయింది. అది పీల్చిన బాధితులు అక్కడి కక్కడే మృతి చెందారు. ఇప్పటి వరకూ 37 మంది మృత దేహాలను వెలికి తీశాం. మరికొంత మంది నదిలోనే గల్లంతయ్యారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టాం" అని నైజీరియన్ పోలీస్ అధికారి పేర్కొన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+