వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిఖత్ జరీన్ సంచలనం: వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌గా అవతరణ

|
Google Oneindia TeluguNews

బాక్సింగ్ సంచలనం నిఖ‌త్ జ‌రీన్ చ‌రిత్ర సృష్టించారు. మ‌హిళ‌ల ప్ర‌పంచ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవ‌త‌రించారు. గురువారం రాత్రి జరిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లో ఘన విజ‌యం సాధించారు. థాయ్‌ల్యాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌ను చిత్తు చేశారు. దాంతో ఉమెన్స్ వ‌ర‌ల్డ్ బాక్సింగ్ చాంపియ‌న్‌గా అవతరించారు. ఈమె స్వస్ధలం తెలంగాణలో గల నిజామాబాద్.. నిఖత్ రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు.

Nikhat Zareen wins historic gold for India

బౌట్‌‌పై ఆరంభం నుంచి నిఖత్ ఆధిపత్యం చెలాయించింది. రింగ్‌లో దూకుడుగా కదిలిన నిఖత్.. ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. ఏ దశలో వెనక్కి తగ్గలేదు. ప్రత్యర్థిపై పంచ్‌లతో విరుచుకుపడింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన ఐదో బాక్సర్‌గా రికార్డు సృష్టించింది. అంతకుముందు మేరీ కోమ్‌, సరితా దేవి, జెన్నీ ఆర్‌ఎల్‌, లేఖ కేసీ మాత్రమే గోల్డ్‌ మెడల్‌ను సాధించారు. వారి తర్వాత ప్లేస్‌లో నిఖత్ నిలిచారు. ఆమెకు రూ. 71 లక్షల ప్రైజ్ మని దక్కనుంది. కేంద్ర, రాష్ట్రాలు నజరానా ప్రకటించే అవకాశం ఉంది.

నిఖత్ జరీన్ మాజీ జూనియర్ చాంపియన్ కూడా.. మహిళల బాక్సింగ్‌లో క్రమంగా ఎదిగారు. మేరీ కోమ్ మాదిరిగా గట్టి పంచ్‌లు ఇస్తుంటారు.

English summary
India's Nikhat Zareen has won gold in the Boxing World Championships defeating Thailand's Jutamas Jitpong by an unanimous decision in the finals.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X