నిమిష ప్రియ మరణశిక్షలో అనూహ్య మలుపు: అర్ధరాత్రి.. యెమెన్ సంచలనం
Nimisha Priya's death sentence: అంతర్జాతీయంగా సంచలనం రేపుతోన్న కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష కేసు అనూహ్య మలుపు తీసుకుంది. ఆమెకు ఊరట లభించింది. ఆమెకు విధించిన మరణ శిక్షను యెమెన్ రద్దు చేసింది. రాజధాని సనాలో తాజాగా నిర్వహించిన అత్యున్నత అత్యవసర సమావేశంలో ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
భారతీయ గ్రాండ్ ముఫ్తీ ఏపీ అబుబకర్ ముసలియార్ కార్యాలయం వెల్లడించింది. నిమిషా ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని యెమెన్ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. దీనిపై ఇంకా ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉందని పేర్కొంది.
2017లో యెమెన్‌కు చెందిన తలాల్ అబ్దో మహదీని హత్య చేసిన కేసులో నిమిషా ప్రియాను దోషిగా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నిమిష.. సనా కారాగారంలో శిక్షను అనుభవిస్తోన్నారు. అక్కడి చట్టాల ప్రకారం.. ఆమెకు మరణశిక్ష విధించాల్సి ఉంది. దీనిపై భారత్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. నిలిపివేయడానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ తనవంతు ప్రయత్నాలు చేసింది.
ప్రముఖ ఎవాంజలిస్ట్, ప్రజా శాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సైతం ఆమెకు అండగా నిలిచారు. యెమెన్ దేశాధినేతలో నేరుగా సమావేశం అయ్యారు. నిమిష ప్రియ మరణశిక్షను రద్దు చేయాలని కోరారు. దీంతో యెమెన్.. మరణశిక్షను తాత్కాలికంగా వాయిదా వేసింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసింది.
ఆమె మరణశిక్షను రద్దు చేయడానికి తాజాగా భారత గ్రాండ్ ముఫ్తీ రంగంలోకి దిగింది. ఈ బోర్డు అభ్యర్థన మేరకు షేక్ ఉమర్ హఫీల్ తంగల్ నియమించిన సీనియర్ యెమెన్ ముస్లియార్ మధ్యవర్తిత్వం వహించారు. దీంతో యెమెన్ మరణశిక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని బోర్డు వెల్లడించింది.
నిమిషా ప్రియ.. కేరళకకు చెందిన మహిళ. పాలక్కాడ్ ఆమె స్వస్థలం. 2008లో ఉపాధి కోసం యెమెన్ వెళ్లారు. అక్కడ మహదీతో కలిసి క్లినిక్ ప్రారంభించారు. ఆ తర్వాత వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తలాల్ తనను వివాహం చేసుకున్నాడని, వేధిస్తున్నాడని నిమిషా ఆరోపించారు. అంతే కాకుండా పాస్‌పోర్ట్‌ను కూడా లాక్కున్నాడని తెలిపారు.

2017లో తలాల్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ముక్కలుగా నరికిన స్థితిలో అతని మృతదేహాన్ని ఓ వాటర్ ట్యాంక్ లో గుర్తించారు. మత్తు మందు ఇచ్చి పాస్‌పోర్ట్ తిరిగి తీసుకోవడానికి నిమిషా ప్రయత్నించారని, డ్రగ్స్ డోస్ ఎక్కువ అవడం వల్ల అతను మరణించాడని దర్యాప్తులో తేలింది. తన తోటి ఉద్యోగితో కలిసి నిమిషా అతన్ని హతమార్చినట్లు యెమెన్ అధికారులు తెలిపారు.
ఈ కేసులో నిమిషాను అరెస్టు చేసి 2018లో హత్య కేసులో దోషిగా నిర్ధారించారు.ఆమెకు విధించిన ఉరిశిక్షను అప్పట్లో మే 16న అమలు చేయాల్సి ఉండగా, వాయిదా వేశారు. దీనిపై భారత ప్రభుత్వం తరపున పలు ప్రయత్నాలు జరిగాయి. నిమిషాకు తొలుత జూలై 16న ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. 2020లో ఆమెకు మరణ శిక్ష విధించగా, 2023లో ఆమె చివరి అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications