హీరో ప్రభాస్ అంటే ఇష్టం: మిస్ అమెరికా నీనా దవులూరి
న్యూయార్క్: మిస్ అమెరికాగా ఎంపికైన తెలుగు అమ్మాయి నీనా దవులూరికి హీరో ప్రభాస్ అంటే ఇష్టమట. వర్షం సినిమా చూసి ప్రభాస్ అభిమానిగా మారిందట. 'వర్షం' సినిమా చూసి ప్రభాస్ అభిమానిని అయ్యానని 2007లో భారతదేశానికి వచ్చినప్పుడు ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపింది.
నీనా దావులూరి తల్లిదండ్రులు దావులూరి కోటేశ్వరరావు చౌదరి, షీలారంజని. వీరి స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడ. నీనా తండ్రి కోటేశ్వరరావు గైనకాలజిస్ట్. వృత్తిరీత్యా 1981లో ఆయన అమెరికాలోని మిస్సోరీకి చేరుకున్నారు. 1989, ఏప్రిల్ 20న నీనా సెరీక్యూజ్‌లో జన్మించింది. ఆమె సోదరి పేరు మీనా. నాలుగేళ్ల వయసులో వీరి కుటుంబం ఒక్లహామాకు, మిషిగాన్‌కు మారింది.

నీనా కాలేజీ చదువు మిషిగాన్‌లోనే సాగింది. 'బెయిన్ బిహేవియర్ అండ్ కాగ్నిటివ్ సైన్స్'లో డిగ్రీ పొందింది. చదువుల్లోనూ నీనాది అగ్రస్థానమే. విద్యాపరంగా తన ప్రతిభతో ఆమె మిషిగాన్ మెరిట్ అవార్డ్, నేషనల్ ఆనర్ సొసైటీ అవార్డ్ వంటి పలు అవార్డులను సాధించింది. నీనా బంధుమిత్రుల్లో చాలా మంది వైద్యులే. నీనా సోదరి మీనా కూడా వైద్య విద్యార్థే.
నీనా 'కార్డియాలజిస్టు' కావడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. ఆమెకు కూచిపూడి, భరత నాట్యాల్లో ప్రవేశం కూడా ఉంది. తెలుగు సినిమాలు చూడటం అంటే ఆమెకు చాలా ఇష్టం. ఒకప్పుడు ఆమె బులీమియా (అధికంగా తిండి తినడం)తో బాధపడేదని, దానివల్ల చాలా బరువు పెరిగిందని, ఆ తర్వాత కష్టపడి వర్కవుట్లు చేసి నాజూగ్గా తయారైందని సెరీక్యూజ్ డాట్ కామ్ అనే వెబ్‌సైట్ చెప్పింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications