మిస్ అమెరికా కిరీటం గెలుచుకున్న తెలుగమ్మాయి
వాషింగ్టన్: మిస్ అమెరికా కిరీటాన్ని ప్రవాసాంధ్ర అమ్మాయి నీనా దావులూరి(24) సొంతం చేసుకున్నారు. నీనా మిస్ అమెరికాగా ఎంపికైన తొలి ప్రవాసాంధ్రురాలే కాకుండా, మొట్టమొదటి ప్రవాస భారతీయురాలు కూడా. పదిహేను మంది సెమీ ఫైనలిస్టులను అధిగమించి నీనా అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది.
నీనా దావులూరి స్వస్థలం కృష్ణా జిల్లా విజయవాడ. ప్లాస్టిక్ సర్జరీపై జడ్జిలు అడిగిన ప్రశ్నకు నీనా బదులిస్తూ... తాను పూర్తిగా సర్జరీకి వ్యతిరేకమని, ఒకసారి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నచ్చిన నచ్చకున్నా దానితోనే ఉండాలని కానీ కృత్రిమపరంగా పుట్టుకతో వచ్చే శారీరక అందంతోపాటు ఏ సర్జరీకి తలవంచని మానసిక అందమే గొప్పదని ఆమె చెప్పిన సమాధానం ఆకట్టుకుంది. ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చునని ఆమె చెప్పారు.

నీనాకు మిస్ అమెరికా తరఫున 50వేల డాలర్లు ఉపకార వేతనాల రూపంలో అందనున్నాయి. కాగా, మిస్ అమెరికా రేసులో నిన్నటి వరకు ఇద్దరు ప్రవాసాంధ్ర అందగత్తెలు పోటీ పడ్డారు. హైదరాబాదుకు చెందిన పామర్తి బిందు(23), నీనా దావులూరిలు ఉన్నారు.
భారత కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం ఆరున్నర గంటలకు న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో నిర్వహించిన తుది పోటీల్లో పాల్గొన్నారు. మిస్ వాషింగ్టన్ డిసిగా ఎంపికైన బిందు జార్జిటౌన్ విశ్వవిద్యాలయంలో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. మిస్ న్యూయార్క్ కిరిటాన్ని కైవసం చేసుకొని, ఇప్పుడు మిస్ అమెరికా కిరీటాన్ని కైవసం చేసుకున్న నీనా మిచిగాన్ విశ్వవిద్యాలయంలో మెదడు పనితీరుపై పరిశోధన చేశారు.












Click it and Unblock the Notifications