మూడోస్సారి: నీరవ్ మోడీకి మళ్లీ బెయిల్ తిరస్కరించిన లండన్ కోర్టు
లండన్: ఒకసారి కాదు... రెండు సార్లు కాదు.. మూడోసారి కూడా ఆర్థిక నేరగాడు నీరవ్ మోడీ బెయిల్‌ను లండన్ కోర్టు తిరస్కరించింది. దీంతో నీరవ్ మోడీ మరిన్ని రోజులు అంటే మే 24 వరకు జైలు జీవితం గడపక తప్పదు.ఇదిలా ఉంటే మే 30వ తేదీనా నీరవ్ మోడీ కేసు పూర్తి స్థాయి విచారణకు రానుంది. ఆ రోజున వ్యక్తిగతంగా నీరవ్ మోడీ కోర్టుకు హాజరుకావాల్సి ఉంటుంది. ఈరోజు వీడియో ద్వారా నీరవ్ మోడీని విచారణ చేయడం జరిగింది.
నీరవ్ మోడీ తరపున వాదిస్తున్న న్యాయవాది కొత్త కారణాలుచూపక పోవడంతో జడ్జీ బెయిల్ తిరస్కరించినట్లు సమాచారం. జ్యుడిషియల్ కస్టడీ పొడగిస్తూ జడ్జీ ఆదేశాలు జారీ చేశారు.ఇక నీరవ్ మోడీని భారత్‌కు రప్పించే విషయంలో మరిన్ని అవసరం అయ్యే డాక్యుమెంట్లు సమర్పించాలని భారత అధికారులను వెస్ట్‌మినిస్టర్ కోర్టు ఆదేశించింది. మార్చి 29న బెయిల్ మంజూరు కోసం జరిగిన వాదనలు విన్న కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. మార్చి 19న నీరవ్ మోడీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా కోర్టు బెయిల్‌ను తిరస్కరించింది.

బ్యాంకుల వద్ద తీసుకున్న డబ్బు చెల్లించక పోవడంతో బ్యాంకులకు పెద్దఎత్తున్న నష్టం వాటిల్లిందని జడ్జి అభిప్రాయపడటంతో బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయాలని చూశారని కోర్టు భావించింది. ఇదిలా ఉంటే నీరవ్ మోడీకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపున న్యాయవాది వాదించారు. యూఏఈ, సింగపూర్‌లలో శాశ్వత సభ్యత్వం నీరవ్ మోడీకి లేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications