నిరాశలో పాకిస్థాన్....! భారత్‌తో చర్చించేందుకు ఎలాంటీ విషయాలు లేవన్న...ఇమ్రాన్ ఖాన్

కశ్మీర్ వివాదంపై పాకిస్థాన్ ఏమీ చేయలేక విసిగిపోయిందా... పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఉన్న దారులన్ని మూసుకుపోయాయా..? దీంతో ఆయన ఇండియాతో ఇక వేగలేమని బావిస్తున్న ఇమ్రాన్ ఖాన్ నిరాశలో మిగిలిపోయాడు.. ఈ నేపథ్యంలోనే ఇండియాతో ఎలాంటీ సంప్రదింపులు,చర్చలు లేవని తెగేసి చెప్పాడు.ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదాస్పద అంశాల మీద భారత్‌తో చర్చలు జరపడంపై ఎటువంటి ఆసక్తి లేదని అంతర్జాతీయ మీడీయాకు ఇచ్చిన ఇంటర్యూలో తన అసహనాన్ని వ్వక్తం చేశాడు.

కశ్మీర్‌‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికర్ రద్దుతో పాటు, రాష్ట్రాన్ని మూడు ముక్కలుగా రెండు ముక్కలుగా చేసిన తర్వాత, దాయాదీ దేశమైన పాకిస్థాన్ జీర్ణించుకోలేక పోతోంది. దీంతో భారత దేశంతో తెగతెంపులు తెంచుకునే విధంగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో పాటు రవాణా వ్యవస్థను కూడ రద్దు చేసింది. ఇంతటితో ఆగకుండా కశ్మీర్ కోసం యుద్దాలు కూడ చేస్తామంటూ హెచ్చరికలు కూడ జారీ చేశాడు. అయినా భారత్ మాత్రం అదరలేదు, బెదరలేదు.

no longer interested in dialogue with India,Imran Khan said

ఇక లాభం లేదనుకుని కశ్మీర్ సమస్యను అంతర్జాతీయ సమాజం దృష్టికి కూడ తీసుకెళ్లాడు. హడవిడి చేసి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశాలు నిర్వహించేలా పావులు కదిపాడు. కాని అక్కడ కూడ ఇమ్రాన్ ఖాన్‌కు మద్దతు లభించలేదు. దీనికి తోడు పెద్దన్న అమేరికా పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చింది. సర్దుకుపోవాలని హితవు పలికింది. మరోవైపు పోరుగు దేశాలు కూడ పాకిస్థాన్‌‌కు మద్దతు పలకలేదు. బంగ్లాదేశ్ లాంటీ దేశాలు కూడ కనీసం సపోర్టు నిలవలేదు. ఇక కశ్మీర్‌లో కూడ ఎలాంటీ ఆందోళనలు చెలరేగకపోవడంతో పాకిస్థాన్‌కు ఎం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలోకి నెట్టివేయబడింది. దీంతో ఇక ముందేప్పుడు భారత దేశంలో శాంతి చర్చలు అంటూ ఉండవంటూ అక్రోశం వెల్లగక్కాడు, తాను చర్చల కోసం చాల ప్రయత్నాలు చేశానని ఇంటర్యూలో చెప్పారు. ఇక ముందు ఎలాంటీ చర్చలు ఉండవంటూ తేల్చిచెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+