తగ్గకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి: భారత్‌కు చైనా వార్నింగ్

Posted By:
Subscribe to Oneindia Telugu

బీజింగ్: సరిహద్దుల్లోని పరిస్థితిపై చైనా మరోసారి భారత్‌కు హెచ్చరికలు జారీ చేసింది. డ్రాగన్ కంట్రీ హెచ్చరికలకు మన దేశం తగ్గటం లేదు. దీంతో శనివారం మరోసారి హెచ్చరించింది.

చదవండి: చిన్న గొడవ కాదు: చైనా, భారత్ ఊహించని షాక్.. అందుకే అలా బెదిరింపు

సరిహద్దు నుంచి భారత్ తన బలగాలను వెనక్కి తీసుకోకుంటే భారత్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బెదిరించే ప్రయత్నాలు చేసింది.

సరిహద్దు నుంచి భారత్ కచ్చితంగా బలగాలను వెనక్కి పిలిపించుకోవాల్సిందేనని, అప్పటి దాకా చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు అధికారిక వార్తా సంస్థ జిన్హుహా తెలిపింది.

డొక్లాం వద్ద భారత్ పదేపదే ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆరోపణలు చేసింది. ఇప్పుడు నెల రోజులుగా సరిహద్దు వద్ద పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయని పేర్కొంది.

2013, 2014లలో లడఖ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నదని, ప్రస్తుత పరిస్థితిని భారత్ అలా పరిగణించకూడదని హెచ్చరించే ప్రయత్నం చేసింది. అప్పుడు దౌత్య చర్చల వల్ల ఫలితం వచ్చిందని, ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు.

అలా చెప్పే ప్రయత్నం

అలా చెప్పే ప్రయత్నం

మరోవైపు, డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లే వరకు భారత్‌తో చర్చలకు తావులేదని చైనా నిపుణులు కూడా చెబుతున్నారు. శీతాకాలం వరకు చైనా దళాల స్టాండాఫ్ కొనసాగుతుందన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్న నేపథ్యంలో ఇండియన్ ఆర్మీని డోక్లాం నుంచి వెనక్కి పిలిపిస్తే తప్ప చర్చలు ఉండవనే విషయాన్ని చెప్పేందుకు చైనా ప్రయత్నిస్తోందన్నారు.

భారత్ ప్లాన్..

భారత్ ప్లాన్..

బ్రిక్స్ ఆధ్వర్యంలో బీజింగ్‌లో జరగనున్న బహుపాక్షిక భద్రతా చర్చల్లో పాల్గొనేందుకు ఈనెల 27, 28 తేదీల్లో అజిత్ దోవల్ చైనాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు చెక్ పెట్టేందుకు ఇదే సమావేశాన్ని అజిత్ దోవల్ ఉపయోగించుకునే అవకాశముందని భావిస్తున్నారు.

చైనా నిర్ణయం!

చైనా నిర్ణయం!

ఈ నేపథ్యంలో చైనా తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డోక్లాం నుంచి భారత బలగాలు వెనక్కి మళ్లితే తప్ప మాటల ముచ్చట లేదన్న విషయాన్ని భారత్‌కు చెప్పేందుకు చైనా ప్రయత్నిస్తోంది.

అలా అయితే సమస్య పరిష్కారం కానట్లేనని..

అలా అయితే సమస్య పరిష్కారం కానట్లేనని..

అయితే శీతాకాలంలో ఇరు దేశాల సైనికులు సరిహద్దు నుంచి వెనక్కి వెళ్తే కనుక సమస్య పరిష్కారమైనట్టు కాదని ఓ నిపుణుడు పేర్కొన్నాడు. శీతాకాలంలో రెండు దేశాల సైనికులు వెనక్కి తగ్గినంత మాత్రాన సమస్య పరిష్కారమవుతుందని తాను భావించడం లేదని, శీతాకాలం తర్వాత తిరిగి ఇరు దేశాల సైన్యం అక్కడ మోహరిస్తుందన్నారు.

రెచ్చగొడుతున్నారని..

రెచ్చగొడుతున్నారని..

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మీడియా కూడా ప్రజల భావాలను రెచ్చగొడుతోందన్నారు. సంప్రదాయ మీడియా వరకు పరవాలేదు కానీ రెండు దేశాల్లోని సోషల్ మీడియా అయితే అగ్నికి మరింత ఆజ్యం పోస్తోందన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Chinese state media on Saturday said that there is no room for negotiation on the Doklam dispute. The remarks comes a days after Ministry of External Affairs said it is using diplomatic channels to resolve stand-off with China in Doklam in the Sikkim region.
Please Wait while comments are loading...