మోడీ వస్తున్నారు, స్లీవ్‌లెస్ వద్దు: మహిళలకి ఫేస్‌బుక్ జుకర్ బర్గ్
కాలిఫోర్నియా: భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు ఫేస్‌బుక్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఫేస్‌బుక్ వ్యవస్థాపకులు జుకర్ బర్గ్ సూటుబూటులో బాగా కనిపించారు. అయితే, తన కార్యాలయంలో పని చేసే వారికి కూడా జుకర్ బర్గ్ డ్రెస్ డీసెంట్‌గా ఉండాలని ఆదేశించారని తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ రాక నేపథ్యంలో.. మహిళలు సహా అందరు క్యాజువల్స్ ధరించాలని సూచించారు. మోడీ మన కార్యాలయానికి వస్తున్నారని, ఫార్మల్స్ ఎవరూ ధరించవద్దని, క్యాజువల్స్ ధరించాలని, మహిళలు స్లీవ్ లెస్, పొట్టి దుస్తులు ధరించవద్దని, నైస్ డ్రస్ ధరించి రావాలని మార్క్ జుకర్ బర్గ్ తన ఉద్యోగులకు చెప్పాడని తెలుస్తోంది.

అయితే, ప్రధాని మోడీ పర్యటన ముగిసిన అనంతరం జుకర్ బర్గ్ వ్యాఖ్యలపై కొందరు అభ్యంతరం చెబుతున్నారు. ఎప్పుడూ క్యాజువల్ వేర్ ఇష్టపడుతూ... వివిధ రకాల టీషర్టులు, జీన్స్ ధరిస్తూ కనిపించే జుకర్ బర్గ్ సైతం మోడీతో సమావేశానికి డ్రస్ కోడ్ పాటిస్తూ సూట్ ధరించి వచ్చాడు.
ముఖ్యంగా మహిళలు ఎటువంటి డ్రస్ కోడ్ ధరించి రావాలన్న విషయమై ఆయన సలహాలు ఇవ్వడం బాగాలేదని కొందరు వ్యాఖ్యానించారు. కాగా, ఫేస్‌బుక్ కార్యాలయానికి వచ్చిన ప్రధాని మోడీ షర్ట్, దాని పైన జాకెట్ ధరించారు.












Click it and Unblock the Notifications