సర్వే: పెరిగిపోతున్న యువతీయువకుల నగ్న సెల్ఫీలు
న్యూయార్క్: అమెరికాలో యువత ఎంత పెడదారిన వెళ్తుందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది ఈ పరిణామం. ప్రస్తుతం యువతీయువకులకు తమ నగ్న సెల్ఫీలను తీసుకుని ఒకరికొకరు పంపించుకోవడం ఓ ఫ్యాషనైపోయింది. ఈ మధ్య కాలంలో నగ్నసెల్ఫీలు పంపుకునే వారిసంఖ్య విపరీతంగా పెరిగిపోతుందని ఓ అధ్యయనంలో తేలింది.
ఈ నగ్న సెల్పీ సంస్కృతి వారి తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఉటా తన పరిశోధనలో వెల్లడించింది. స్మార్ట్ ఫోన్లతో ఇలాంటి అశ్లీల సెల్పీలు తీసుకుని ఒకరికొకరు పంపుకోవడాన్ని ‘సెక్సింగ్' అని కూడా పిలుచుకుంటున్నారు.

ఉన్నత పాఠశాల స్థాయిలో చదువుతున్న దాదాపు 1130 మందిని యునివర్సిటీ బృందం సర్వే చేయడంతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తాము నగ్న సెల్ఫీలు తీసుకుని వేరేవాళ్లకు పంపినట్లు 20శాతం మంది చెప్పగా.. తాము ఇతరుల నుంచి నగ్న సెల్ఫీలు అందుకున్నామని 38శాతం మంది చెప్పారని సర్వే బృందం తెలిపింది.
ఆ విధంగా అందుకున్న ప్రతి ఐదుగురిలో ఒకరు ఆ ఫొటోలను ఇతరులకు ఫార్వర్డ్ చేశారట. అలా పంపిన వారు, అందుకున్న వారిలో యువతీ, యువకుల సంఖ్య సమానంగా ఉందని అధ్యయనం వెల్లడించింది. ఫొటోలు ఫార్వర్డ్ చేసే వాళ్లలో యువకులే ఎక్కువ మంది ఉన్నారని తెలిపింది. నగ్న సెల్ఫీలు పంపేవారిలో పురుషులు 24.2శాతం ఉంటే.. స్త్రీలు 13శాతం మంది ఉన్నారని పేర్కొంది.












Click it and Unblock the Notifications