రసాయన శాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి

Nobel Prize: రసాయన శాస్త్రంలో విశేష పరిశోధనలు జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ బహుమతి (Nobel Prize 2024) వరించింది. ప్రొటీన్ల డిజైన్లకు సంబంధించిన పరిశోధనలకు గానూ శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్ (David Baker), డెమిస్ హసబిస్ (Demis Hassabis), జాన్ ఎం. జంపర్ (John M. Jumper) ను నోబెల్ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తాజాగా వెల్లడించింది.

కంప్యూటేషనల్ ప్రొటీన్ డిజైన్‌కు గానూ బెకర్, ప్రొటీన్ స్ట్రక్చర్ ప్రిడికన్ కు గానూ డెమిస్, బంపర్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. వైద్య విభాగంలో మొదలైన నోబెల్ పురస్కారాల ప్రదానం అక్టోబర్ 14 వరకు కొనసాగనుంది. సోమవారం వైద్యశాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించగా.. మంగళవారం భౌతిక శాస్త్రంలో నోబెల్ అవార్డులను వెల్లడించారు.

Nobel Prize in Chemistry for three scientists

తాజాగా, బుధవారం రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారానికి ఎంపికైనా ముగ్గురు శాస్త్రవేత్తల జాబితా ప్రకటించారు. గురువారం సాహిత్య విభాగానికి సంబంధించి అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించనుంది. శుక్రవారం రోజున నోబెల్ శాంతి బహుమతి, అక్టోబర్ 14న అర్థశాస్త్రంలో నోబెల్ గ్రీహతల పేర్లను అకాడమీ వెల్లడించనుంది.

కాగా, గత సంవత్సరం నానో టెక్నాలజీకి సంబంధించిన క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణ, అభివృద్ధికి గానూ ముగ్గురు శాస్త్రవేత్తలను రసాయన శాస్త్రంలో నోబెల్‌ బహుమతి లభించింది. అమెరికాకు చెందిన మౌంగి బవెండి(62), లూయిస్‌ బ్రూస్‌(80), అలెక్సీ ఎకిమోవ్‌(78)లకు 2023కి నోబెల్‌ బహుమతిని స్వీడెన్​‌లోని స్టాక్​‌హోం​లో జరిగిన కార్యక్రమంలో రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెన్స్‌ వెల్లడించింది.

నోబెల్ బహుమతి గురించిన వివరాల్లోకి వెళితే.. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్త ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. 1896లో ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ మరణించగా, 1901 నుంచి ఆయన ట్రస్ట్ ద్వారా ఈ అవార్డులను ఏటా ప్రదానం చేస్తున్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలకు 11 లక్షల స్వీడిష్‌ క్రోనర్‌ (10 లక్షల డాలర్లు) నగదు అందిస్తారు. ప్రతి ఏడాది డిసెంబర్‌ 10న నిర్వహించే కార్యక్రమంలో గ్రహీతలకు అవార్డులను అందజేస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+