Nobel Prize 2023 in Physics: ఎలక్ట్రాన్స్‌పై ప్రయోగాలు - ముగ్గురికి అవార్డ్

స్టాక్‌హోమ్: వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. ఒక్కోరోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన ఉండబోతోంది.

ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే మెడిసిన్‌లో నోబెల్ బహుమతి విజేతల పేర్లను ప్రకటించింది జ్యూరీ కమిటీ.

Nobel Prize in Physics 2023 award to Pierre Agostini, Ferenc Krausz and Anne L’Huillier

మెడిసిన్‌లో అద్భుతాలను ఆవిష్కరించిన హంగేరియన్- అమెరికన్ బయో కెమిస్ట్ కటాలిన్ కరికో, అమెరికన్ ఫిజీషియన్ సైంటిస్ట్ డ్రూ వీస్‌మన్‌లకు నోబెల్ బహుమతి వరించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ల తయారీలో వారిద్దరూ కృషి చేశారు. ఎంఆర్ఎన్ఏ ఆధారిత కోవిడ్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడంలో అత్యంత కీలకమైన న్యూక్లియోసైడ్ బేస్ సవరణలను సూచించారు.

తాజాగా ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి కోసం ఎంపికైన శాస్త్రవేత్తల పేర్లను వెల్లడించారు. ముగ్గురికి ఉమ్మడిగా ఈ అవార్డు వరించింది. పియర్రీ అగొస్టిని, ఫెరెంక్ క్రాస్జ్, అన్నె ఎల్ హ్యులియర్‌కు జాయింట్‌గా ఫిజిక్స్‌లో నోబెల్ ప్రైజ్‌ను ప్రకటించారు. ఈ ముగ్గురు- ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లో అట్టోసెకెండ్ పల్సెస్ డెవలప్‌మెంట్‌పై ప్రయోగాత్మక విధానాలకు బాటలు వేశారు.

ఒక పదార్థం (మ్యాటర్)లో ఎలక్ట్రాన్ డైనమిక్స్‌ ద్వారా అటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేయడంపై ప్రయోగాత్మక పద్ధతులను కనుగొన్నారు. ఈ సెగ్మెంట్‌లో ఈ ముగ్గురు చేసిన కృషిని గుర్తిస్తూ నోబెల్ బహుమతి కోసం ఈ ముగ్గురిని ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ సెక్రెటరీ జనరల్ ఒలావ్ జోల్‌స్టాడ్ తెలిపారు. స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో గల కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

పియర్రె అగొస్టిని- ది ఓహియో స్టేట్ యూనివర్శిటీలో డిపార్ట్‌‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. ఫెరెంక్ క్రాజ్ హంగేరియన్- ఆస్ట్రియన్ ఫిజిసిస్ట్. ఆస్ట్రియాలోని టెక్నికల్ యూనివర్శిటీ ఆఫ్ వియన్నాలో ప్రొఫెసర్. అన్నా ఎల్ హ్యుయిలియర్ ఫ్రెంచ్- స్వీడిష్ ప్రొఫెసర్. స్వీడన్‌లోని ల్యూండ్ యూనివర్శిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫిజిక్స్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తోన్నారు. ఈ ముగ్గురికీ ఫిజిక్స్‌లో ఈ ఏడాది నోబెల్ బహుమతి లభించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+