విశ్వం నుంచి దూసుకొచ్చే అంతుచిక్కని న్యూట్రినోల గుట్టు విప్పిన శాస్త్రవేత్తకు నోబెల్.. !!

వేర్వేరు రంగాలకు చెందిన శాస్త్రేవేత్తలు, ఆర్థికవేత్తలు, ఇతర సామాజిక ఉద్యమకారులకు ప్రతి సంవత్సరం అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ బహుమతుల సందడి మొదలైంది. వారం రోజుల పాటు ఈ అవార్డుల ప్రకటన కొనసాగుతుంది. ఒక్కోరోజు ఒక్కో రంగంలో కృషి చేసిన వారికి నోబెల్ బహుమతుల ప్రకటన ఉండబోతోంది.

Nobel Medicine Prize 2026: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం- ఎందుకంటే?
Nobel Medicine Prize 2026: వైద్య శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం- ఎందుకంటే?

ఆర్థికం, వైద్యం, సామాజిక అంశాలు, పర్యావరణం, ఫిజిక్స్.. ఇలా విభిన్న రంగాల్లో నూతన ఒరవడిని సృష్టించిన, వాటికి ఆద్యులైన శాస్తవేత్తలకు అందించే ఈ అవార్డుల ప్రకటన పరంపర సోమవారం ప్రారంభమైంది. ఇప్పటికే మెడిసిన్‌లో నోబెల్ బహుమతి విజేతల పేర్లను ప్రకటించింది జ్యూరీ కమిటీ. కాంతిని ప్రసరంపజేయడం ద్వారా మెదడు కణాలను యాక్టివేట్ చేయవచ్చంటూ నిరూపించిన పీటర్ హెగెమాన్, జార్జ్ నాగెల్, కార్ల్ డీసెరోత్ లకు సంయుక్తంగా ఈ అవార్డు లభించింది.

Nobel Prize in Physics has been awarded to Francis Halzen of the University of Wisconsin Madison

తాజాగా ఫిజిక్స్ లో నోబెల్ అవార్డును ప్రకటించింది జ్యూరీ. విస్కాన్సిన్- మాడిసన్ యూనివర్శిటీకి చెందిన ఫ్రాన్సిస్ హాల్జెన్‌కు ఈ పురస్కారం లభించింది. ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ ఏర్పాటులో ఆయన చేసిన కృషి, విశ్వంలోని ఘర్షణల ప్రక్రియల నుంచి వెలువడుతున్న అధిక శక్తి న్యూట్రినోల ఆవిష్కరణకు గాను ఈ పురస్కారానికి గాను ఫ్రాన్సిస్ నామినేట్ అయ్యారు. విశ్వం అంతటా ప్రయాణించే అత్యంత సూక్ష్మ కణాలను గుర్తించే విధానాన్ని ఆయన అభివృద్ధి చేశారు.

భారత్ సీజ్ ఫైర్ ప్రతిపాదన భేష్.. రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ కీలక ప్రకటన
భారత్ సీజ్ ఫైర్ ప్రతిపాదన భేష్.. రష్యాతో యుద్ధం వేళ ఉక్రెయిన్ కీలక ప్రకటన

న్యూట్రినోలను గుర్తించడం చాలా కష్టం. వాటికి విద్యుద్దావేశం ఉండదు. సెకనుకు కోట్లాది న్యూట్రినోలు మన శరీరాల గుండా ప్రయాణించినప్పటికీ, వాటి ఉనికిని ఏ మాత్రం కూడా మనం పసిగట్టలేం. అవే న్యూట్రినోలు అంతరిక్షంలో ఎలా ప్రయాణించగలవనే విషయంపై ఫ్రాన్సిస్ పరిశోధనలు చేశారు. అధిక శక్తి కలిగిన న్యూట్రినోలు విశ్వంలో ఎంత దూరమైనా ప్రయాణించగలవని నిరూపించారు. వీటిపై పరిశోధనలు చేయడం ద్వారా ఆ న్యూట్రినోలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అయ్యాయనేది కూడా తెలుసుకోవచ్చు.

దీనివల్ల విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన విస్ఫోటనాలు, అవి చోటు చేసుకునే ప్రదేశాల గురించి సమగ్ర సమాచారాన్ని న్యూట్రినోల ద్వారా తెలుసుకోవచ్చని నిర్ధారించారు. 1988 లోనే ఫ్రాన్సిస్ హాల్జెన్ వీటిని గుర్తించడానికి ప్రయోగాలు చేశారు. దక్షిణ ధ్రువం కింద ఉన్న మంచు పొరను ఒక భారీ కణాల గుర్తింపు పరికరంగా ఉపయోగించవచ్చని ప్రతిపాదించారు. అధిక శక్తి కలిగిన న్యూట్రినో ఈ మంచులోని అణుకేంద్రంతో ఢీకొన్నప్పుడు, ఆ చర్య వల్ల చిన్న కాంతి మెరుపు ఏర్పడుతుంది.

ఐస్‌క్యూబ్‌లో అంటార్కిటిక్ మంచులో లోతుగా అమర్చిన వేలాది కాంతి సెన్సర్లు ఈ చిన్న కాంతి మెరుపులను గుర్తిస్తాయి. వాటి ఆధారంగా న్యూట్రినో ప్రయాణించిన దిశ, దాని శక్తిని అంచనా వేయవచ్చని తన పరిశోధనల్లో పొందుపరిచారు. దక్షిణ ధ్రువంలో ఉండే వాతావరణం ఈ ప్రయోగానికి అనుకూలం కావడం వల్ల ఐస్‌క్యూబ్ న్యూట్రినో అబ్జర్వేటరీ నిర్మించాలని సూచించారు. ఆయన ప్రతిపాదనల తర్వాతే ఇది కార్యాచరణలోకి వచ్చింది.

2011లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి న్యూట్రినోల మీద పరిశోధనలు సాగిస్తూ వచ్చారు శాస్త్రవేత్తలు. దీనికి ఫ్రాన్సెస్ హాల్జెన్ సారథ్యం వహించారు. సుమారు ఒక క్యూబిక్ కిలోమీటర్ పరిమాణంలో ఉన్న మంచును తమ పరిశోధనల కోసం ఉపయోగించారు. న్యూట్రినోలను బంధించడానికి ప్రత్యేకంగా సెన్సార్లను అమర్చారు. ఈ సెన్సార్ల గుండా న్యూట్రినోలు ప్రయాణించినప్పుడు వాటి పుట్టుక ఎక్కడిదనేది ఆరా తీశారు.

వాటిల్లో కొన్ని మన సౌర కుటుంబానికి అవతల ఉన్న సుదూర ప్రాంతాల నుంచి వచ్చినట్లు గుర్తించారు. వాటికి సంబంధించిన సమగ్ర ఆధారాలను సేకరించారు. ఈ ఆవిష్కరణ విశ్వాన్ని అధ్యయనం చేయడంలో ఒక కొత్త మార్గానికి బాటలు వేసింది. దీన్ని న్యూట్రినో ఆస్ట్రానమీగా ఖరారు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+