విషాదం: తల్లి గట్టిగా హత్తుకోవడంతో శిశువు మృతి

ఉత్తర కరోలినా: అమెరికాలోని ఉత్తర కరోలినాలో విషాద ఘటన చోటు చేసుకుంది. గుక్కపెట్టి ఏడుస్తున్న కన్న కొడుకును వూరడించేందుకు ప్రయత్నించిన ఓ తల్లి.. చిన్నారిని గట్టిగా హత్తుకుంది. కాగా, ఊపిరాడకపోవడంతో ఆ శిశువు మృతిచెందాడు. మే 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. అలెగ్జాండర్‌ కౌంటీకి చెందిన ఏషియా మేరీ పాషికోకు మే 20న మగబిడ్డ జన్మించాడు. అతడికి టేలర్‌ అని పేరుపెట్టుకుంది. అయితే గత మంగళవారం చిన్నారిలో కదలిక లేకపోవడతో 911 అత్యవసర నంబర్‌కు కాల్‌ చేసింది. వారు వచ్చి.. చిన్నారిని పరిశీలించగా.. మృతిచెందినట్లు తెలిసింది.

North Carolina mother charged with murder after smothering her 4-day-old baby boy

అయితే తన బాబు గుక్కపట్టి ఏడుస్తుంటే గట్టిగా హత్తుకుని వూరడించానని.. అప్పటి నుంచి చిన్నారిలో కదలిక లేదని ఏషియా తెలిపింది. అది ప్రమాదవశాత్తు జరిగిన ఘటన అని.. కావాలని తానీపని చేయలేదని వాపోయింది.
కాగా, ఊపిరాడకపోవడం వల్లే బాబు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. శిశువు మృతికి కారణమైన ఏషియాపై సెకండ్‌ డిగ్రీ హత్య కేసు నమోదు చేశారు. జూన్‌ 6న దీనిపై విచారణ చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+