నిక్కీ హేలీ.. ఓ వేశ్య, నోరు అదుపులో పెట్టుకో: అమెరికాకు ఉత్తరకొరియా వార్నింగ్!

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ను దారితీసుకొచ్చే ప్రయత్నాలన్ని విఫలమయ్యాయని, యుద్దపిపాసికి తీవ్ర చర్యలతోనే బదులివ్వాలని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

అదొక్కటే!, మరో మార్గం లేదు.. యుద్ద పిపాసికి అదే గుణపాఠం: 'కిమ్'పై అమెరికా, చైనా మాత్రం!

తాజాగా నిక్కీ హేలీ వ్యాఖ్యాలపై ఉత్తరకొరియా తీవ్ర స్థాయిలో స్పందించింది. స్కర్ట్స్ వేసుకునే నిక్కీ హేలీని ఉత్తరకొరియా వేశ్యగా అభివర్ణించింది. ఈ మేరకు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ఒక కథనాన్ని ప్రచురించింది. నడిచే సమయంలో తాను వేసుకున్న స్కర్ట్ తో హేలీ వింత శబ్దం చేస్తారని దూషించింది.

North Korea calls US ambassador Nikki Haley a prostitute swishing her skirt

అలాంటి హేలీకి ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారని విమర్శించింది.

గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరించడం కాకుండా.. ఉత్తరకొరియా గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆ కథనం ద్వారా హెచ్చరికలు జారీ చేశారు.తమ దేశంపై ఆంక్షలు విధించడానికి ఐరాస కౌన్సిల్ లో హేలీ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని ఉత్తరకొరియా అందులో పేర్కొంది.

కాగా, ఉత్తరకొరియా విషయంపై చర్చించడానికి సమావేశమైన ఐరాస కౌన్సిల్ లో నిక్కీ హేలీ ఆ దేశంపై పలు వ్యాఖ్యలు చేశారు. యుద్దం చేయాల్సిందిగా ఆ దేశం అడుక్కుంటోందని, చర్చల పేరుతో ఇప్పటికీ 9సార్లు సమావేశమైనా ఎలాంటి పరిష్కారం దొరకలేదని అన్నారు. వాణిజ్యపరమైన ఆంక్షలతో పాటు భద్రతాపరమైన ఆంక్షలు తీసుకురావడం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెంచాలని ఆమె ఐరాస్ కౌన్సిల్ లో డిమాండ్ చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea has responded to criticism from a US ambassador by calling her a “prostitute” who is “swishing her skirt".

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి