దడ పుట్టించే 'అస్త్రం': ఉ.కొరియాతో యుద్దం అంటే పారిపోవాల్సిందే.., ఎక్కడిదీ వెరుపులేని తనం?
ప్యోంగ్‌యాంగ్: దేశం చిన్నదే కావచ్చు. కానీ ఉత్తరకొరియా సైనిక శక్తి అగ్ర రాజ్యానికి ధీటుగా ఉందన్న సంకేతాలు విస్మరించలేనివి. అమెరికాను ఢీకొట్టడానికి ఏమాత్రం వెరుపు లేకుండా వ్యవహరించడం వెనుక సైనిక శక్తి ఒక్కటే కారణం కాదు.
ఏక కాలంలో అణు శక్తిని, బయోలాజికల్ వెపన్స్ ను ఉత్తరకొరియా అభివృద్ది చేసుకుంటూ వస్తోంది. జపాన్, దక్షిణ కొరియాలతో జతకట్టినా సరే.. దౌత్య పరంగా తమను ఒంటరి చేసినా సరే.. అణు ప్రయోగాల విషయంలో ఉత్తరకొరియా ఎక్కడా తగ్గలేదు.
ఐక్యరాజ్య సమితి ఆదేశాలను సైతం పక్కనబెట్టి.. స్వీయ రక్షణ కోసమే అణ్వాయుధ తయారీ చేసుకుంటున్నామని పదేపదే చెబుతోంది. ఉత్తరకొరియా అణు సామర్థ్యంపై వ్యక్తమైన అనుమానాల్లాగే.. ఇప్పుడు ఆ దేశంలో తయారవుతున్న బయోలాజికల్ వెపన్స్‌పై కూడా అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
నిజంగా ఆ దేశానికి సొంతంగా బయోలాజికల్ వెపన్స్ తయారుచేసుకునే సత్తా ఉందా? అన్న ప్రశ్న అందులో ప్రధానంగా వినిపిస్తోంది. కానీ వాస్తవాలు మాట్లాడుకోవాల్సి వస్తే ఉత్తరకొరియా సామర్థ్యాన్ని చిన్నచూపు చూడటం సరికాదనే వాదన కూడా వినిపిస్తోంది.

అమెరికా తలరాత మా చేతుల్లో:
ఉత్తరకొరియా అధికారిక పత్రిక మింజు చోసన్ ప్రచురించిన ఓ వ్యాసం ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాపై ఉత్తరకొరియా పోరాటం వెరుపులేనిది అనే రీతిలో ఆ వ్యాసం ప్రచురితమైంది.
'అమెరికా తలరాత ఇక ఉత్తరకొరియా చేతుల్లోనే ఉంది. బ్లాక్‌మెయిలింగ్, బయటపెట్టడాలు ఇక మా ముందు చెల్లవు. అది అమెరికాకు నచ్చినా.. నచ్చకపోయినా.. మాకు అనవసరం. కవ్వింపు ప్రకటనలతో ట్రంప్ తన దేశానికి పెను ముప్పును తేవాలని చూస్తున్నాడు. అందుకే యుద్ధం కోసం కాలు దువ్వుతున్నాడు. ఆ లెక్కన ట్రంప్ మరణశయ్యపై ఉన్నట్లే లెక్క' అంటూ ఆ వ్యాసంలో పేర్కొనడం గమనార్హం. ఉత్తరకొరియా కేబినెట్ నుంచి సేకరించిన అభిప్రాయంగా ఈ వ్యాసాన్ని ప్రచురించారు.

బయోలాజికల్ వెపన్స్:
అమెరికన్, ఆసియా ఇంటలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం బయోలాజికల్ వెపన్స్ తయారుచేయడంలో ఉత్తరకొరియా నిమగ్నమైంది. ఇప్పటికే పెద్ద ఎత్తున బయోలాజికల్ వెపన్స్ ను ఆ దేశం తయారుచేసుకుందని తెలుస్తోంది.
భారీ విధ్వంస ఆయుధాల (వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్-డబ్ల్యూఎండీ) నిపుణుడు జోషువా పొల్లాక్ కూడా ఉత్తరకొరియాకు ఆ సామర్థ్యం ఉందనే అంటున్నారు. బయోలాజికల్ వెపన్స్ తయారీ కోసం, అందుకు అవసరమైన ఆయుధాల దిగుమతి కోసం ఉత్తరకొరియా భారీగా ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు.

13రకాల బయోలాజికల్ ఏజెంట్స్:
నివేదికలు చెబుతున్న దాని ప్రకారం ప్రస్తుతం ఉత్తరకొరియా వద్ద 13రకాల బయోలాజికల్ ఏజెంట్స్ ఉన్నాయని తెలుస్తోంది. కేవలం పది రోజుల వ్యవధిలో వీటిని ఆయుధాలుగా ప్రయోగించవచ్చని, వీటిల్లో స్మాల్ పాక్స్, ఆంథ్రాక్స్ వంటి ప్రాణాంతక ఏజెంట్స్ కూడా ఉన్నాయని సమాచారం.
పొల్లాక్ దీనిపై మాట్లాడుతూ.. ' ఆంథ్రాక్స్ అనే బాక్టీరియా ప్రంపంచలో ఎక్కడైనా.. ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనగలుగుతుంది. ప్రయోగించిన ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కలకు వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి బయోలాజికల్ వెపన్స్ ద్వారా ప్రయోగించడానికి ఆంథ్రాక్స్ ఏజెంట్ ను ఉత్తరకొరియా ఉపయోగించుకోవచ్చు' అని చెప్పుకొచ్చారు.

ఆఖరి అస్త్రంగా ప్రయోగించడానికి:
ఇప్పటిదాకా అణు క్షిపణులతోనే అమెరికాను భయపెడుతూ వచ్చిన ఉత్తరకొరియా.. పరిస్థితులు ముంచుకొస్తే బయోలాజికల్ వార్ ప్రకటించడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. సూపర్ జెమ్స్ రూపంలో అమెరికాపై మెరుపు దాడి చేయడానికి ఆ దేశం సమాయత్తంగా ఉందని, ఆఖరి అస్త్రంగా ఉత్తరకొరియా బయోలాజికల్ వెపన్స్ ఉపయోగించవచ్చునని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సైనిక పరంగాను, క్షిపణుల పరంగాను, ఇప్పుడు బయోలాజికల్ వెపన్స్ పరంగాను ఉత్తరకొరియా ఒక తిరుగులేని శక్తిగా అవతరించడానికి సిద్దపడుతున్నట్లు ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. అమెరికాను ఢీకొట్టడానికి వెనుకాడకపోవడం వెనుక ఇవే ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications