షాక్: ఆయుధ ప్రదర్శన చేసిన ఉత్తరకొరియా, కారణమిదే!

అవసరమైతే అమెరికా యుద్ద నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయధాలను మంగళవారం నాడు ప్రదర్శించింది.

ప్యాంగ్ యాంగ్: అవసరమైతే అమెరికా యుద్ద నౌకలను సైతం పేల్చేస్తామని హెచ్చరించిన ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయధాలను మంగళవారం నాడు ప్రదర్శించింది.

తమ సైన్యం ఏర్పాటై 85 ఏళ్ళు పూర్తైన సందర్భాన్ని పురస్కరించుకొని ఉత్తరకొరియా ఈ ఆయుధ సంపత్తిని ప్రదర్శించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా వార్తాసంస్థ యోన్ హస్ తెలిపింది.

తూర్పు తీరంలోని వోన్సాన్ నగరంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆయుధ ప్రదర్శన నిర్వహించినట్టు దక్షిణకొరియా ప్రభుత్వవర్గాలను ఉటంకిస్తూ యోన్ హాస్ తెలిపింది.

North Korea conducts large scale artillery drills on anniversary

అంతకుముందు కూడ దేశ ఆవిర్భావదినాన్ని పురస్కరించుకొని ఉత్తరకొరియా తమ వద్ద ఉన్న ఆయుధాలను ప్రదర్శించింది. అప్పట్లో జలాంతర్గామల నుండి ప్రయోగించగలిగే ఖండాంతర క్షిపణులను కూడ ప్రదర్శించారు.

అవకాశం దక్కినప్పుడల్లా తమ వద్ద ఉన్న భారీ స్థాయిలో ఆయుధాలు ఉన్యాయో చూసుకోవాలంటూ ప్రపంచ చేశాలకు ప్రదర్శించి చూపించడం ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కు అలవాటు. అందులో భాగంగానే ఇప్పుడూ కూడ ఆయుధాలను ప్రదర్శించారని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+