వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరకొరియాతో ఇక తాడోపేడో, యుద్ధం దిశగా అమెరికా అడుగులు.. 24 గంటలు హైఅలర్ట్!

ఉత్తరకొరియాతో అమెరికా యుద్ధం చేయడానికే నిర్ణయించుకుంది. మాటలతో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దిగిరాడని అర్థం చేసుకున్న అమెరికా ఇప్పుడు చేతల్లోకి దిగింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఉత్తరకొరియాతో అమెరికా యుద్ధం చేయడానికే నిర్ణయించుకుంది. మాటలతో ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దిగిరాడని అర్థం చేసుకున్న అమెరికా ఇప్పుడు చేతల్లోకి దిగింది.

Recommended Video

China looks at North Korea with frustration ఉ. కొరియా అంటే హడలెత్తిపోతున్న చైనా | Oneindia Telugu

ఎన్నిమార్లు హితవు చెప్పినా పెడచెవిన పెడుతూ తన చర్యల ద్వారా ప్రపంచ దేశాలను హడలగొడుతున్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ భరతం పట్టేందుకే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

 సైన్యాన్ని సిద్ధం చేస్తోన్న ట్రంప్...

సైన్యాన్ని సిద్ధం చేస్తోన్న ట్రంప్...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తరకొరియాతో తాడోపేడో తేల్చుకునేందుకే నిర్ణయించుకున్నారు. ఆ దిశగా ఆయన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ ప్రతినిధి బోరిస్ జాన్సన్ లండన్‌లో ప్రకటించారు. ఇరు దేశాల అధ్యక్షుల నడుమ కొద్దిరోజులుగా మాటల యుద్ధం జరగడాన్ని ఆయన ప్రస్తావించారు.

 ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం...

ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం...

ఉత్తరకొరియాపై దాడికి సిద్ధంగా ఉండాలంటూ ఇప్పటికే అమెరికా సైనికులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టుగా అమెరికా విదేశాంగ ప్రతినిధి బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఒకవేళ ఉత్తరకొరియాపై అమెరికా దాడి జరిపితే జరగబోయే నష్టాన్ని ఊహించలేమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై కూడా తీవ్రంగా ఉంటుందని బోరిస్ హెచ్చరించారు. అయితే ట్రంప్ తొందరపడి దాడి నిర్ణయం తీసుకుంటారని తాను అనుకోవడం లేదని బోరిస్ అభిప్రాయపడ్డారు.

 ఇక సంఘర్షణకు ముగింపు...

ఇక సంఘర్షణకు ముగింపు...

కొద్దిరోజులుగా ఉత్తరకొరియాతో జరుగుతున్న సంఘర్షణలకు ముంగిపు పలికేందుకు అమెరికా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ఇప్పటికే అమెరికాలోని అన్ని ఎయిర్‌ఫోర్స్ బేస్ స్టేషన్లకు 24 గంటలపాటు హైఅలర్ట్ కూడా ప్రకటించారు.

 సరిహద్దుల్లో బీ-52 బాంబర్లు...

సరిహద్దుల్లో బీ-52 బాంబర్లు...

ఉత్తరకొరియాపై అణుదాడి జరిపేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో మోహరించేందుకు న్యూక్లియర్ మిస్సైల్‌లను ప్రయోగించగల బీ-52బాంబర్ యుద్ధ విమానాలను కూడా అమెరికా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

ధ్రువీకరించిన జనరల్ గోల్డ్ ఫెయిన్స్...

ధ్రువీకరించిన జనరల్ గోల్డ్ ఫెయిన్స్...

ఈ విషయాన్ని అమెరికా వైమానిక దళం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డేవిడ్ గోల్డ్‌ఫెయిన్స్ కూడా ధృవీకరిస్తున్నారు. 1991 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో అమెరికా యుద్ధ విమానాలు, న్యూక్లియర్ మిస్సైల్ బాంబులతో సిద్ధం కావడం తాను చూడలేదని గోల్డ్ ఫెయిన్స్ వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

English summary
THE US are preparing to place their nuclear bombers on 24-hour alert for the first time since the Cold War in response to threats of annihilation from Kim Jong-un, it has been revealed. US Air Force chief of staff General David Goldfein confirmed the plan amid concern North Korea’s nuclear warpath could ignite World War 3. It comes after Donald Trump met with his top military chiefs, claiming their talks were “the calm before the storm”. Speaking with Defense One, General Goldfein said: “This is yet one more step in ensuring that we’re prepared.“I look at it more as not planning for any specific event, but more for the reality of the global situation we find ourselves in and how we ensure we’re prepared going forward.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X