ఆమెరికాపై చైనా ఆగ్రహం, ఉత్తర కొరియాకు షాకిచ్చిన డ్రాగన్ కంట్రీ
ఉత్తర కొరియాపై అమెరికా మళ్లీ ఆంక్షలు పెట్టడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలా ఆంక్షలు విధించడం సరికాదని చైనా పేర్కొంది.
బీజింగ్: ఉత్తర కొరియాపై అమెరికా మళ్లీ ఆంక్షలు పెట్టడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ వ్యాపారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇలా ఆంక్షలు విధించడం సరికాదని చైనా పేర్కొంది.
ఉత్తర కొరియా మళ్లీ అణు పరీక్షలు చేపట్టకూడదన్న లక్ష్యంతో నౌకా వాణిజ్యం, వారితో వ్యాపారం చేసే చైనా ట్రేడర్స్‌పై అమెరికా ఆంక్షలు పెట్టింది.

పేరున్న సంస్థలు ఉత్తర కొరియాతో వేలకోట్ల డాలర్ల విలువైన వ్యాపారం చేస్తున్నాయని అమెరికా కోశాగార కార్యదర్శి స్టీవెన్ మ్నుచిన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
అయితే, అమెరికా ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ఒక దేశం తమ సొంత చట్టాలు, విధానాల ఆధారంగా మరో దేశంపై ఏకపక్షంగా ఆంక్షలు పెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, అమెరికా ఆరోపణలకు సాక్ష్యాలు చూపించాలని చైనా పేర్కొంది.
మరోవైపు, ఉత్తర కొరియాకు ఎయిర్ చైనా విమాన సర్వీసులను నిలిపివేసింది. అయితే అకస్మాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో మాత్రం చైనా వెల్లడించలేదు.
ఇది వ్యాపారపరమైన నిర్ణయం మాత్రమేనని, దీని వెనక ఎలాంటి రాజకీయ ఒత్తిడీ లేదని డ్రాగన్ కంట్రీ చెబుతోంది. డిమాండ్ తక్కువగా ఉన్న కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ ఎయిర్ చైనా ఉత్తర కొరియాకు సర్వీసులను నిలిపివేసింది. కొద్ది రోజులకే మళ్లీ పునరుద్ధరించింది.












Click it and Unblock the Notifications