ఆయన అంతే... చిన్న తప్పుకే చంపేస్తాడు..! నార్త్ కొరియాలో వెలుగుచూసిన మరో దారుణం..
ఉత్తర కొరియా ఆ పేరు వినగానే గుర్తుకొచ్చేది నియంత పాలన. కిమ్ జోంగ్ ఉన్ అంటేనే నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనమన్న అభిప్రాయం ఉంది. చిన్న తప్పులు చేసిన వారిని కూడా క్రూరంగా శిక్షిస్తారన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. ట్రంప్‌తో జరిగిన భేటీ విఫలమైనందుకు రాయబారితో పాటు మరో నలుగురి ప్రాణాలు తీసినట్లు నార్త్ కొరియా న్యూస్ పేపర్లలో కథనాలు వెలువడ్డాయి.

రాయబారి కాల్చివేత
ఈ ఏడిదా ఫిబ్రవరిలో హనోయి వేదికగా అమెరికా - నార్త్ కొరియా రెండో సమ్మిట్ జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి యూఎస్‌లో నార్త్ కొరియా రాయబారి కిమ్ హ్యాక్ చోల్ అన్ని వ్యవహారాలు చూసుకున్నారు. కిమ్‌తో పాటు ప్రైవేటు ట్రైన్‌లో ఆయన కూడా ప్రయాణించారు. అయితే భేటీ విషయంలో కిమ్ హ్యాక్ చోల్ నమ్మకద్రోహానికి పాల్పడ్డారన్న కారణంతో కిమ్ జాంగ్ ఉన్ ఆయనకు శిక్ష విధించారు. నార్త కొరియా అధినేత ఆదేశాల మేరకు ఫైరింగ్ స్క్వాడ్ కిమ్ హ్యాక్ చోల్‌ను కాల్చిచంపినట్లు తెలుస్తోంది.

మరో నలుగురు అధికారులు
ఈ ఏడాది మార్చిలో ఫైరింగ్ స్క్వాడ్ హ్యాక్ చోల్‌ను హతమార్చినట్లు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో నలుగురు అధికారులను సైతం మియామీ ఎయిర్‌పోర్టులో కిమ్ హత్య చేయించినట్లు సమాచారం. అయితే వారెవరన్న విషయం ఇంకా తెలియలేదు. నలుగురు అధికారుల మరణ శిక్షకు సంబంధించి వచ్చిన వార్తా కథనాలపై స్పందించేందుకు నార్త్ కొరియా ప్రభుత్వం నిరాకరించింది.

తప్పుడు అనువాదం చేసినందుకు జైలు శిక్ష
ఇదిలా ఉంటే ట్రంప్, కిమ్ భేటీకి ట్రాన్స్‌లేటర్‌గా వ్యవహరించిన షిన్ హయ్ యాంగ్ అనే మహిళను కిమ్ జైలుకు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. సమావేశంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను అనువదించడంలో ఆమె పొరపాటు చేసినందున శిక్ష విధించినట్లు తెలుస్తోంది. చర్చలు విఫమైనట్లు ట్రంప్ ప్రకటించిన తర్వాత ఆయన చేసిన ప్రతిపాదనను షిన్ సరిగా వివరించకలేక పోయిందనందునే జైలుకు పంపినట్లు సమాచారం.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications