యుద్ధానికి దిగిన కిమ్‌జొంగ్- రష్యాకు వేలాది సైనికులు

North Korea: రష్యా-ఉక్రెయిన్ మధ్య రోజుల తరబడి హోరాహోరీగా యుద్ధం కొనసాగుతోంది. 2022 ఫిబ్రవరి 24వ తేదీన ఆరంభమైన ఈ యుద్ధానికి అంతం అనేది ఉండట్లేదు. ఇన్ని రోజులుగా నిరాటంకంగా ఈ రెండు దేశాలు తలపడుతూనే వస్తోన్నాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగుతున్న ఈ పోరులో ఉక్రెయిన్‌లోని పలు నగరాలు ధ్వంసం అయ్యాయి.

వందలాదిమంది ప్రాణాలు కోల్పోయారు. అదే స్థాయిలో ఆస్తినష్టం సంభవించింది. అయినప్పటికీ ఏ దేశం కూడా వెనక్కి తగ్గట్లేదు. ఈ యుద్ధం వల్ల ఇప్పటికే ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని పలు నగరాలు నేలమట్టం అయ్యాయి. వాటిన్నింటినీ రష్యా సైనిక బలగాలు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి.

North Korea has sent 12 000 troops to support Russia s war against Ukraine Reports

మరియోపోల్, మెలిటొపోల్, క్రిమియా, డాన్‌బాస్, డొనెట్స్క్, లుహాన్స్క్, ఖేర్సన్, సుమి, ఒడెస్సా, చెర్న్‌హీవ్.. వంటి నగరాలను రష్యా సైనిక బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాల నుంచి ఎదురవుతోన్న ఒత్తిళ్లు, ఆంక్షలు, పలు రకాల నిషేధాలను కూడా రష్యా ధీటుగా ఎదుర్కొంటోంది.

రష్యా సైన్యానికి ఉక్రెయిన్ అంత తేలిగ్గా తలవంచట్లేదు. ధీటుగా ఎదుర్కొంటోంది. కొన్ని సందర్భాల్లో పైచేయిని సాధించింది కూడా. రష్యా ఆధీనంలో ఉన్న కొన్ని కీలక నగరాలను విడిపించుకోగలిగింది. అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా సహా యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అందిస్తోన్న ఆయుధాలు, యుద్ధ సామాగ్రితో రష్యా దూకుడుకు అడ్డుకట్ట వేయగలుగుతోంది.

రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి రష్యా సైన్యం చుట్టుముట్టినప్పటికీ..వారిని వెనక్కి పంపించగలిగింది. రోజులు గడుస్తున్నప్పటికీ ఉక్రెయిన్ అంత త్వరగా లొంగకపోవడం వల్ల రష్యా కీలక నిర్ణయాలను తీసుకుంది. ఈ యుద్ధంలో ఉత్తర కొరియా సహకారాన్ని తీసుకుంది. రష్యాకు మద్దతుగా 12,000 ట్రూప్‌లను ఉత్తర కొరియాకు రష్యాకు పంపించింది.

ఈ విషయాన్ని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ విభాగం వెల్లడించింది. ఉత్తర కొరియా పంపించిన ట్రూప్‌లో అత్యంత శక్తిమంతమైన స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ సైతం ఉన్నట్లు నిర్ధారించింది. ఈ మేరకు సియోల్ కేంద్రంగా పని చేస్తోన్న దక్షిణ కొరియా అధికారిక న్యూస్ ఏజెన్సీ యోన్‌హాప్ ప్రకటించింది.

North Korea has sent 12 000 troops to support Russia s war against Ukraine Reports

ఉత్తర కొరియాకు చెందని 1,500 యుద్ధనౌకలు ఇప్పటికే రష్యా పోర్ట్ సిటీ వ్లాదివోస్టోక్‌కు చేరినట్లు వెల్లడించింది. రష్యా మిలటరీ యూనిఫాం ధరించి కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాడే అవకాశం ఉందని యోన్‌హాప్ అంచనా వేసింది. నార్త్ కొరియా నుంచి బయలుదేరిన సైనికులు రష్యాలోని ఉస్సురియాస్క్, ఖబరోవ్‌స్క్, బ్లగొవెన్షెన్స్క్ వంటి నగరాలకు చేరినట్లు నిర్ధారించింది కూడా.

ఈ సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. అత్యవసర సమీక్షను నిర్వహించారు. ఉత్తర కొరియా వంటి దేశం రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళనకరమని యూన్ సుక్ వ్యాఖ్యానించినట్లు యోన్‌హాప్ తెలిపింది. ఉత్తర కొరియా సైనిక బలగాలు ఇప్పటికే దేశం విడిచి వెళ్లిపోయాయని పేర్కొంది.

మొదటి నుంచీ కూడా ఉక్రెయిన్‌కు నాటోలో సభ్యత్వాన్ని ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ వస్తోన్నారు ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్. ఇదే విషయంపై ఆయన రష్యాకు మద్దతు పలికారు. ఎలాంటి సహకారాన్నయినా అందిస్తామంటూ గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా రష్యా నుంచి అందిన ప్రతిపాదనల మేరకు 12,000 ట్రూప్‌లను ఆ దేశానికి పంపించిందని దక్షిణ కొరియా పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+