ఉత్తర కొరియా నియంతకు మరో కీలక పదవి: చెల్లెలిని కూడా కాదని: ఆయనకు తప్ప మరొకరికి నో ఛాన్స్
ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్.. మరో కీలక పదవిని అందుకున్నారు. అధికార వర్కర్స్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో కొనసాగుతోన్న వర్కర్స్ పార్టీ ఎనిమిదవ జాతీయ మహాసభ సందర్భంగా అగ్ర నాయకత్వం ఆయన నియామకాన్ని అధికారికంగా ప్రకటించింది. వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ ఆరో రోజు సమావేశాల్లో కిమ్‌జొంగ్‌ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ తీర్మానాన్ని ఆమోదించినట్లు ఉత్తర కొరియా అధికార మీడియా కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (KCNA) వెల్లడించింది.
ఈ జాతీయ కాంగ్రెస్ మహాసభల సందర్భంగా వర్కర్స్ పార్టీలో కొన్ని కీలక మార్పులు, చేర్పులు చేశారు. పార్టీ అంతర్గతంగా కొనసాగుతూ వచ్చిన సెక్రెటేరియట్ వ్యవస్థను మళ్లీ పునరుద్ధరించారు. 2016 నాటి జాతీయ మహాసభల సందర్భంగా ఈ వ్యవస్థను తొలగించారు. ఈ అయిదేళ్ల వ్యవధిలో చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని..మళ్లీ సెక్రెటేరియట్ సిస్టమ్‌ను పునరుద్ధరించాలని వర్కర్స్ పార్టీ అగ్ర నాయకులు నిర్ణయించారు. దీనికి అనుగుణంగా తీర్మానాన్ని ఆమోదించారు.

ఇప్పటిదాకా వర్కర్స్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిమ్ జొంగ్ ఉన్ తండ్రి కిమ్ జొంగ్ ఇల్ ఉన్నారు. 2011లో ఆయన మరణించినప్పటికీ.. ఆ ఖాళీని భర్తీ చేయలేదు. కిమ్‌జొంగ్ ఇల్ గౌరవార్థం ఆయన మరణానంతరం కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. అంతకుముందు కిమ్ తాత ఆ పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగారు. తాజాగా- కిమ్‌జొంగ్ ఉన్‌ను ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తమ దేశాధినేతను ఏక్రగీవంగా ఎన్నుకొన్నట్లు వర్కర్స్ పార్టీ అగ్ర నాయకులు ప్రకటించారు. ఈ మహాసభలకు హాజరైన ప్రతి నాయకుడు కూడా కిమ్ నియామకాన్ని సమర్థించారని తెలిపారు.
నిజానికి- వర్కర్స్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కిమ్ సోదరి కిమ్ యో జొంగ్ నియమితులవుతారంటూ మొదట్లో వార్తలు వెలువడ్డాయి. దేశాధినేతగా కిమ్ తీరిక లేని కార్యక్రమాల్లో గడపాల్సి ఉంటున్నందున.. ఆయన చెల్లెలిని పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించడానికి అవకాశం ఉందంటూ ఉత్తర కొరియా మీడియా అంచనా వేసింది. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. యో జొంగ్‌కు బదులుగా కిమ్‌నే ఆ స్థానానికి ఎన్నుకున్నారు. ఇదివరకు ఆమె వర్కర్స్ పార్టీ పొలిట్‌బ్యురో సభ్యురాలిగా పనిచేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications