వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆపే ప్రసక్తే లేదు: కిమ్ హెచ్చరిక, తప్పించుకునే వీలు లేకుండా సరిహద్దులో ఇలా!..

ఇటీవలి కాలంలో ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాలోకి అక్రమంగా వలస వెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అక్కడి అరాచకాలను తట్టుకోలేని చాలామంది సరిహద్దు గుండా దేశం దాటడానికి ప్రయత్నిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

ప్యోంగ్‌యాంగ్: తమను ఉగ్రదేశాల జాబితాలో చేరుస్తూ నిర్ణయం తీసుకోవడంపై అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తరకొరియా ధీటుగా బదులిచ్చింది. తాము అణ్వాయుధాలు తయారుచేసేది ప్రపంచ దేశాలను భయపెట్టడానికి కాదని, తమ దేశ రక్షణ కోసమేనని స్పష్టం చేసింది.

ఉత్తరకొరియా ప్రతీకారానికి దక్షిణ కొరియా, జపాన్ అమెరికాకు సహకరిస్తున్నాయని ఆ దేశం ఆరోపించింది. ఎవరెన్ని చేసినా.. తాము మాత్రం అణుపరీక్షలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. అంతేకాదు, గతంలో చెప్పినట్టు గువాం ద్వీపంపై దాడికి కట్టుబడి ఉన్నామని హెచ్చరించింది. భవిష్యత్తు పరిణామాలకు అమెరికా, జపాన్ దేశాలు సిద్దంగా ఉండాలంటూ హెచ్చరించింది.

ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..ఇదొక్కటి చాలు: ఉ.కొరియాలో ప్రజల దుస్థితి చెప్పడానికి, ఆఖరికి చావులోను..

అమెరికాది ద్వంద్వ నీతి:

అమెరికాది ద్వంద్వ నీతి:

తమ దేశ రక్షణ కోసమే అణ్వాయుధాలు తయారుచేసుకుంటున్నామని ఉత్తరకొరియా తన గొంతును బలంగా వినిపిస్తోంది. ఈ తరహా వాదన అమెరికాకు ప్రతికూలమనే చెప్పాలి. భారీ ఎత్తున ఆయుధాలను తయారుచేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా చాలాదేశాలకు ఆయుధాలను అమ్ముకుంటున్న అమెరికా.. ఉత్తరకొరియా విషయంలో మాత్రం శాంతి గురించి మాట్లాడుతుండటం చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. అమెరికా ద్వంద్వ నీతికి ఇదో ఉదాహరణగా చాలామంది అభివర్ణిస్తున్నారు.

అమెరికా ద్వంద్వ నీతి?: యుద్దం బూచితో ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా?అమెరికా ద్వంద్వ నీతి?: యుద్దం బూచితో ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా?

ఉ.కొరియాకు మద్దతు నిలిచేదెవరు?:

ఉ.కొరియాకు మద్దతు నిలిచేదెవరు?:

తమ స్వీయ రక్షణ కోసమే అణ్వాయుధాలు తయారుచేస్తున్నామంటూ ఉత్తరకొరియా చెబుతున్నప్పటికీ.. అంతర్జాతీయంగా ఆ దేశానికి మద్దతు కరువవుతోంది. అమెరికాను కాదని ఆ దేశానికి మద్దతు తెలపడానికి ఏ దేశం ధైర్యం చేయలేకపోతోంది. అమెరికా కక్ష కడితే ఎంతటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసు కాబట్టే.. ప్రపంచ దేశాలేవి ఉత్తరకొరియా వాదనలపై సానుకూలంగా స్పందించే ధైర్యం చేయలేకపోతున్నాయి. దీనికి తోడు ఉత్తరకొరియాలో కిమ్ జాంగ్ అరాచాక పాలన కూడా ఆ దేశానికి మద్దతును దూరం చేస్తోంది.

చికిత్స పొందుతున్న 'ఓహ్':

చికిత్స పొందుతున్న 'ఓహ్':

ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోతూ అక్కడి సైన్యం చేతిలో తీవ్రంగా గాయపడ్డ సైనికుడిని 'ఓహ్'(24) అని పిలుస్తున్నారు అతనికి చికిత్స అందిస్తున్న డాక్టర్. భద్రతా కారణాల రీత్యా అతని అసలు పేరును బయటపెట్టడం లేదని తెలుస్తోంది.

ప్రస్తుతం ఓహ్ బాగానే కోలుకుంటున్నాడని డాక్టర్ చెబుతున్నారు. తీవ్ర రక్త స్రావం కావడంతో రక్తం చాలా అవసరమైందని, ఇద్దరు దక్షిణ కొరియన్లు తమ రక్తం ఇవ్వడానికి ముందుకు రావడంతో చికిత్స సులువైందని తెలిపారు. ఓహ్ హెపటైటిస్ వ్యాధితో బాధపడుతున్నాడని ఆయన పేర్కొన్నారు. 24ఏళ్ల వయసు, 5.5 అడుగుల పొడవున్న ఓహ్.. ఆ వయసులో ఒక సాధారణ దక్షిణ కొరియా పౌరుడు ఉండే బరువు కన్నా తక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. పౌష్టికాహార లోపమే ఇందుకు కారణంగా చెప్పారు.

పారిపోయే వీలు లేకుండా:

పారిపోయే వీలు లేకుండా:

ఇటీవలి కాలంలో ఉత్తరకొరియా నుంచి దక్షిణ కొరియాలోకి అక్రమంగా వలస వెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అక్కడి అరాచకాలను తట్టుకోలేని చాలామంది సరిహద్దు గుండా దేశం దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 'ఓహ్' అనే సైనికుడు దేశం దాటి వెళ్లిపోయాడు.

ఈ నేపథ్యంలో కిమ్ సరిహద్దు వెంబడి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాడు. చుట్టూ లోతైన కందకాలు తవ్విస్తూ తప్పించుకునే వీలు లేకుండా చేస్తున్నాడు. సరిహద్దు వెంబడి సైనికులను కూడా కిమ్ మార్చివేశారు. ప్రస్తుతం పూర్తిగా కొత్త సైన్యాన్ని సరిహద్దు వెంబడి నియమించినట్టు తెలుస్తోంది.

English summary
North Korea has replaced nearly all the soldiers along the border where one of their former comrades defected, a South Korean lawmaker said Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X