ఉత్తరకొరియా కిమ్ ఫిట్‌నెస్ వీడియో చూశారా?.. కెవ్వుకేక!
అమెరికాకు ముచ్చెమటలు పట్టిస్తోన్న ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఫిట్ నెస్ విషయంలో రాజీపడడట. వ్యాయామం చేస్తూ ఆయన ప్రదర్శించిన ఓ విన్యాసానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్యాంగ్ యాంగ్: వరుస క్షిపణి పరీక్షలతో ప్రపంచ దేశాల గుండెల్లో రైళ్ల పరిగెత్తిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కి సంబంధించి ఏ వార్త అయినా ఆసక్తికరమే. ఉత్తరకొరియా అధికారిక మీడియా కొరియాన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) ఆయన గుప్పిట్లోనే ఉంటుంది.
అవసరం అనుకున్న వార్తలను మాత్రమే ప్రపంచానికి వెల్లడించడానికి కిమ్ అనుమతిస్తారు. ఈ అధికారిక మీడియా కాకుండా ఉత్తరకొరియా గురించిగాని, కిమ్ గురించిగాని మరే ఇతర మీడియా ఏ వార్త వెల్లడించినా.. అందంతా'విశ్వసనీయ' సమాచారంమే.
ఇక కిమ్ గురించి మనకు చాలా కొద్దిగానే తెలుసు. ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా అన్ని మీడియాలు ప్రయత్నిస్తూనే ఉంటాయి. కిమ్ జాంగ్ ఉన్ చండప్రచండ నియంత మాత్రమే కాదు.. చక్కటి బాస్కెట్ బాల్ క్రీడాకారుడు. ఆయన సంగీత ప్రియుడని, సంగీతం పట్ల మక్కువతోనే గాయని రిసోల్ జు ని పెళ్లాడాడని ప్రచారంలో ఉంది.
అంతేకాదు, కిమ్ జాంగ్ చక్కని భోజన ప్రియుడు కూడా. బొద్దుగా ఉండే ఆయన.. శరీర దారుఢ్యం విషయంలో మాత్రం ఎంతమాత్రం రాజీపడడని కూడా చెబుతుంటారు. రెండుకాళ్లు పైకెత్తి.. చేతులను నాలకు ఆన్చి గిరగిరా తిరుగుతూ కిమ్ చేసిన వ్యాయామ విన్యాసాల వీడియో ఒకటి సోషల్ మీడియాలో 'కెవ్వుకేక' గా మారింది.
ఆ వీడియోలో ఉన్నది నిజంగా కిమ్ జాంగేనా.. లేకపోతే డూపా అన్న విషయంలో స్పష్టత లేదు. గత ఏడాదే సోషల్ మీడియాలో పోస్ట్ అయినట్లుగా ఉన్న ఆ వీడియోను ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చిత్రీకరించారో తెలియదు కానీ మొత్తానికి ఈ వీడియో వైరల్ గా మారింది. మీరూ ఓ లుక్కేయండి మరి!












Click it and Unblock the Notifications