ఒక్కదెబ్బతో యుద్ధనౌక ముంచేస్తాం: కొరియా, అమెరికాకు జపాన్ తోడు

పసిఫిక్‌ సముద్రంలోని అమెరికా నావికా దళానికి చెందిన విమాన వాహక నౌకలు తమ తీర సమీపంలోకి వస్తే ముంచేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.

ప్యాంగ్‌యాంగ్: పసిఫిక్‌ సముద్రంలోని అమెరికా నావికా దళానికి చెందిన విమాన వాహక నౌకలు తమ తీర సమీపంలోకి వస్తే ముంచేస్తామని ఉత్తర కొరియా హెచ్చరించింది.

అమెరికా-జపాన్‌ సాయుధదళాలు సంయుక్త సైనికవిన్యాసాలు చేపట్టనున్న సందర్భంగా హెచ్చరికలు రావడం గమనార్హం.

ఉత్తర కొరియా క్షిపణి పరీక్షల నేపథ్యంలో విమానవాహక నౌక కారల్‌ విన్సన్‌ను తగిన ఆయుధాలతో కొరియా సముద్రతీరానికి సమీపంగా వెళ్లమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఆదేశించారు.

సముద్రంలో ముంచేస్తాం

సముద్రంలో ముంచేస్తాం

అమెరికా నౌకలు అణ్వాయుధాలతో వచ్చినా తాము వాటిని సముద్రంలో ముంచేస్తామని ఉత్తర కొరియా అధికార వర్కర్స్‌ పార్టీకి చెందిన ప్రతినిధి ప్రకటించారు. దీంతో కొరియా ద్వీపకల్పంతో పాటు జపాన్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

జపాన్, దక్షిణ కొరియాల్లో అప్రమత్తత

జపాన్, దక్షిణ కొరియాల్లో అప్రమత్తత

జపాన్‌, దక్షిణ కొరియాలు పూర్తి అప్రమత్తతను ప్రకటించాయి. ఎలాంటి దాడినయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని జపాన్‌, దక్షిణ కొరియాలు అలర్ట్‌ ప్రకటించాయి. అవసరమైతే అణ్వాయుధాలను ప్రయోగించడానికి వెనుకంజ వేయబోమని ఉత్తర కొరియా ఇప్పటికే ప్రకటించింది.

అమెరికా యుద్ధ నౌకకు జపాన్ తోడు

అమెరికా యుద్ధ నౌకకు జపాన్ తోడు

కాగా, ప్రస్తుతం పశ్చిమ పసిఫిక్‌ మహా సముద్రంలో విన్యాసాలు జరుపుతున్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌక కార్ల్‌ విన్సన్‌‌కు జపాన్‌కు చెందిన రెండు విధ్వంసక నౌకలు తోడయ్యాయి.

కొరియా దిశగా..

కొరియా దిశగా..

కార్ల్‌ విన్సన్‌కు తోడుగా, జపాన్‌కు చెందిన సమిడారే, అషిగారా నౌకలు ఉత్తర కొరియా వైపు పయనిస్తున్నాయి. కొరియా ద్వీపకల్పం వైపు వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్ల్‌ విన్సన్‌ నౌక సిబ్బందిని ఇది వరకే ఆదేశించారు. ఆ నౌకకు తోడుగా కనీసం తూర్పు చైనా సముద్రం వరకు వెళ్లాలని జపాన్‌ తన మిలటరీ అధికారులకు సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+